కాపీ కొట్టారన్న విలేఖరి- పూరి జగన్నాధ్ ఫైర్
దర్శకుడు పూరి జగన్నాథ్, ఇతర దర్శకులు, సంగీత దర్శకులకు సంబంధించిన పాటలు, సన్నివేశాలు వేరే భాషా చిత్రాల కాపీ అంటూ అప్పుడప్పుడూ మీడియాలో కథనాలు దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో "బిజినెస్ మ్యాన్" చిత్రం గురించి మీడియాకు వివరించటానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ సమావేశంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రసంగిస్తూ ఉండగా , ఒక విలేఖరి "మీ చిత్రంలో ఫలానా పాట వేరే భాషా చిత్రమలోని పాటకు కాపీ కదా" అని అడిగాడు. దీనికి పూరి జగన్నాథ్ ఇచ్చిన సమాధానం తెలుగు సినీ అభిమానులను ఒక్కసారి విస్మయానికి గురి చేసింది.
పూరి ఏమన్నారంటే... "సార్ మనం తీసే సినిమా టెక్నాలజీనే మనది కాదు. అలాగే యారీ 3 కెమెరా తెలుగుది కాదు. వేరే ఎవరో తయారు చేస్తే మనం వాడుకుంటుంన్నాం. అసలు సినిమాలే కాపీ కొడుతూంటే మీరు ఒక పాట కాపీ కొట్టటం గురించి మాట్లాతారేంటి...?సాంగ్స్ డోంట్ నీడ్ ఆర్గ్యుమెంట్స్ " అంటూ రుసరుసలాడారట. ఇలా సమాధానం ఇవ్వడం ద్వారా మేము కాపీ కొడుతున్నాం...అనే విషయాన్ని పూరి పరోక్షంగా వెల్లడించడంతో పాటు, అలా చేయడాన్ని సమర్థించుకున్నారనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











