సినిమాలో బన్ని తో కలిసి గణేష్,పూరీ స్టెప్స్
హైదరాబాద్ : అల్లు అర్జున్, ఆమలాపాల్, కేథరిన్ కాంబినేషన్ లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం 'ఇద్దరమ్మాయిలతో..'. ఈ చిత్రం ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో టాప్ లేచిపోద్ది అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్ సినిమా అంతా అయిపోయాక ఎండ్ క్రెడిట్స్ రోల్ అవుతుండగా ప్లే అవుతుంది.
ఆ పాటలో పూరీ,గణేష్ కలిసి బన్ని తో స్టెప్స్ వేస్తున్నారు. ఆ స్టెప్స్ ని ఇప్పటికే చిత్రీకరించారు. బాలీవుడ్ లో ఇలా ఎండ్ క్రెడిట్స్ టైమ్ లో సాంగ్స్ వేసే ట్రెండ్ ఉంది. దాన్ని ఇక్కడ ఇలా కంటిన్యూ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో వేసిన భారీ సెట్‌లో చివరి పాట చిత్రీకరిస్తున్నామని, మరోవైపు ఎడిటింగ్, డబ్బింగ్ జరుపుతున్నామని, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా మరో చిత్రంగా ఈ చిత్రం ఉంటుందని, థియేటర్ ట్రైలర్లకు, టీజర్‌కు రెస్పాన్స్ లభించిందని తెలిపారు.
బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: అమూల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











