పూరి జగన్నాథ్ నన్ను ఫాలో అవుతున్నాడంటూ సంపూ ట్వీట్
హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి సంపూర్ణేష్ బాబు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు. ‘భక్తులు గుడికి వెళతారు, దేవుళ్లు మన ఇళ్లకి మాత్రం రారు....ఎందుకు రాను...పూరి గారు ఫాలో అవుతున్నారు...ఫ్రౌడ్ మూమెంట్' అంటూ ట్వీట్ చేసారు. ట్విట్టర్లో పూరి జగన్నాథ్ సంపూర్నేష్ బాబును ఫాలో అవుతుండటంతో....ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన సంపూ ఇలా పూరి దేవుడిగా, తనను భక్తుడిగా.....పోల్చుకుని గర్వంగా ఫీలవుతున్నాడు.
సంపూర్ణేష్ బాబు సినిమాల విషయానికొస్తే...త్వరలో ‘సింగం 123', ‘కొబ్బరి మట్ట' చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సింగం 123...
చిత్రాన్ని మంచు విష్ణు తమ 24 ఫ్రేమ్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మే 15 న చిత్రం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కూడా పబ్లిసిటీ వెరైటీగా చేస్తున్నారు. నాలుక మడతెట్టి సంపూర్ణేష్ బాబు ఫోటోలకు పవర్ ఫుల్ ఆటిట్యూడ్ తో ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మంచు విష్ణు నిర్మిస్తోన్న ఈ చిత్రంలోసంపూర్ణేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.... సంపూర్ణేష్‌బాబు నుంచి ప్రేక్షకులు ఏ తరహా వినోదాన్ని కోరుకుంటున్నారో అది ఈ సినిమాలో వంద శాతం వుంటుంది. కథకు తగ్గ హీరో కుదిరారు. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాం అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ నేటి వాస్తవ పరిస్థితులని ప్రతిభింబిస్తూ..నేటి యువతరాన్ని ఉత్తేజపరుస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, ఎడిటర్: యం.ఆర్.వర్మ, మ్యూజిక్: శేషు, డైలాగ్స్: డైమండ్ రత్నం, ఆర్ట్: రఘు కులకర్ణి, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత: విష్ణు మంచు, దర్శకత్వం: అక్షత్ అజయ్ శర్మ.
కొబ్బరి మట్ట...
‘హృదయ కాలేయం' సినిమాతో చెత్త సినిమా తీసిన చెత్త హీరోగా తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని విధంగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు త్వరలో ‘కొబ్బరి మట్ట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగు కూడా విడుదల చేసారు.
‘కొబ్బరి మట్ట' ఒక కుటుంబ కథా చిత్రం... నా దృష్టిలో కుటుంబం అంటే ఒక పాక, భార్య అంటే నచ్చి తెచ్చుకునే తవుడు, ఇక పిల్లలు అంటే మన ఇష్టంతో కలుపుకునే కుడితి.... కానీ నా దృష్టిలో తండ్రి అంటే పాలిచ్చే మగ ఆవు. ఇలాంటి గొప్ప సెంటిమెంట్ కథా చిత్రంలో గుండెని హత్తుకునే ఒక పాటని మీ కోసం నేను స్వయంగా పాడాను...భారత స్వాతంత్ర్య ఫలాలని 68 సంవత్సరాలుగా ఆస్వాదించిన మీరు..ఈ చిత్ర గీత స్వరాలని అలాగే ఆదరిస్తారని నమ్ముతున్నాను.... అంటూ ప్రకటన విడుదల చేసారు. ఈ చిత్రానికి నిర్మాత: ఆది కుంభగిరి, కథ-స్క్రీన్ ప్లే, మాటలు: స్టీవెన్ శంకర్, కూర్పు : కార్తీక శ్రీనివాస్, స్టంట్స్: జాషువ, సంగీతం: కమ్రన్, లైన్ ప్రొడ్యూసర్: సురేష్, దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్.


Click it and Unblock the Notifications











