'హార్ట్‌ఎటాక్' శాటిలైట్ రైట్స్ ఎవరికి ...ఎంతకి?
హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'హార్ట్‌ఎటాక్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని లీడింగ్ టెలివిజన్ ఛానెల్ జెమినీ వారు పొందినట్లు తెలుస్తోంది. నాలుగున్నర కోట్ల రూపాయలకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. పూరీ దర్శకుడు కావటం, వరస హిట్స్ లో ఉన్న నితిన్ హీరో కావటంతో ఈ రేంజి రేటు పలికినట్లు చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం హీరో క్యారక్టరైజేషన్ తో నడుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్‌ని ఓ పోకిరి ప్రేమికుడిగా చూపించబోతున్నారు. తొలిసారిగా నితిన్ ...పూరి దర్శకత్వంలో నటించటంపై మంచి అంచానాలే ఉన్నాయి. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ... ''మాస్, క్లాస్ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్ గెటప్, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు యువతరాన్ని అలరిస్తాయనే నమ్మకం ఉంది'' అని చెప్తున్నారు.
ప్రేమ కథలు తెరకెక్కించడంలో పూరి జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. అందులోనే వినోదం, పోరాట దృశ్యాలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'హార్ట్‌ఎటాక్'. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంస్థ తెరకెక్కిస్తోంది. నితిన్ సరసన ఆదా శర్మ హీరోయిన్ . అలాగే ఈ చిత్రంలో నితిన్ పికలతో కనిపించనున్నారు. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది.
నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్.అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












