హాట్ టాపిక్:పూరీ,ఇలియానా డార్క్ రూమ్ స్టోరీ
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఇప్పుడు ఇలియానా,పూరి డార్క్ రూమ్ స్టోరీనే నలుగుతోంది. మొన్న జరిగిన 'దేవుడు చేసిన మనుషులు'ఆడియో పంక్షన్ లో పూరీ స్టేజీపై ఇలియానాకు కథ చెప్పటానికి వెళ్లిపోయినప్పుడు జరిగిన సంఘటన వివరించారు. పూరీ ఆమెకు 'దేవుడు చేసిన మనుషులు'కథ చెప్పటానికి వెళ్లినప్పుడు కరెంట్ పోయింది. ఆమె ఉందా లేదా అన్న పరిస్దితుల్లో కథ మొదలెట్టాడు. కాస్సేపటికి నవ్వులు మొదలయ్యాయి. చూస్తే ఇలియానా నవ్వుతోంది. అలా ఆమెకు కథ వినిపించారని చెప్పారు. దాన్ని డార్క్ రూమ్ స్టోరీగా చెప్పుకుంటున్నారు పరిశ్రమలో జనం.
రవితేజ, ఇలియానా జంటతో దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' సినిమా ఆడియో సీడీలు సోనీ మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రం పాటలు అంతటా మంచి పేరు తెచ్చుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియాపై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె స్వరాలకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శిల్పకళావేదికలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆడియో సీడీలతో పాటు థియేటర్ ట్రైలర్‌నూ ఆవిష్కరించారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ "ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది వేరే సెటప్‌తో తీసిన సినిమా. కథలేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో తీసిన సినిమా. మొదట ఈ కథని ఇలియానాకి చెప్పా. తను టాక్సీ డ్రైవర్‌గా బాగా చేసింది. రవితేజతో ఇది నాకు ఐదో సినిమా. రవి అంటే నాకు మోజు. హైదరాబాద్‌లో నాకు తగిలిన మొదటి ఫ్రెండు రఘు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బర్తాంతే ఇందులో ఓ ఐటమ్ సాంగ్ చేసింది'' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











