For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్స్, మసాజ్ కోసం మాత్రం కాదు: పూరీ జగన్నాద్

  By Srikanya
  |

  హైదరాబాద్: బ్యాంకాక్ అంటే చాలా మంది ఫ్రీ సెక్స్, మసాజ్ కోసమే అనుకుంటారు..కానీ అదేమీ కాదు ... మనందరికీ సెక్స్ ఇంట్రస్ట్ కాబట్టి, ఆ పాయింటాఫ్‌వ్యూలోనే బ్యాంకాక్ ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఆ కంట్రీలో వ్యభిచారం లీగల్. చాలామంది టూరిస్టులు కూడా కేవలం సెక్స్ కోసమే వస్తుంటారు కానీ అక్కడ బోలెడన్ని టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి అంటున్నారు పూరీ జగన్నాధ్. ఆయన తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  బ్యాంకాక్ కు ఎక్కువమంది హెల్త్ కోసం వస్తుంటారు. ఆరు నెలలో, ఎనిమిది నెలలో అక్కడే ఉండి థాయ్ ఆయుర్వేద కేంద్రాల్లో చికిత్స పొందుతుంటారు. మన బాడీని ఫుల్ క్లీన్ చేసి, ఆర్గాన్స్‌ని కరెక్ట్ చేసి మనల్ని రీచార్జ్ చేసే ట్రెడిషనల్ మసాజ్ సెంటర్స్ అక్కడ చాలా ఉన్నాయి. ఫ్రీడమ్‌కు అర్థం తెలియాలంటే ఆ దేశానికి ఒక్కసారైనా వెళ్లి తీరాల్సిందే అన్నారు. అలాగే తనకు బ్యాంకాక్ పౌరసత్వం లేదు కానీ, తీసుకోవాలని ఉంది. ఇల్లు ఉందన్న సంగతి కూడా నిజంకాదు. ఇప్పుడు కొనబోతున్నా. హైదరాబాద్‌తో పోలిస్తే రేటు తక్కువే అనుకుంటా. అయితే కంపెనీ పేరుమీద తప్ప, ఇండివిడ్యువల్‌గా తీసుకోవడం కుదరదు. లేకపోతే ఎవరైనా థాయ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇండివిడ్యువల్‌గా కొనుక్కోవచ్చు. నా రిటైర్మెంట్ జీవితం బ్యాంకాక్‌లోనే. బీచ్ ఒడ్డున రెండెకరాల స్థలం కోసం ట్రై చేస్తున్నా అన్నారు.

  ఇక ఇక్కడ అమీర్‌పేటలో తిరిగితే నన్ను ఎంతమంది గుర్తు పడతారో తెలీదుగానీ, అక్కైడె తే ప్రతి ఒక్కరూ నన్ను గుర్తుపడతారు. మా పిల్లల పేర్లతో సహా చెబుతారు. ప్రతి సమ్మర్‌కీ మా ఫ్యామిలీ మెంబర్‌్తతో కూడా వెళ్తుంటా. అక్కడ వార్డ్ మెంబర్‌గా పోటీ చేసినా కూడా గెలిచేస్తానని మా ఫ్రెండ్స్ జోక్ చేస్తుంటారు అన్నారు. బ్యాంకాక్ కు నేనే కాదు... అక్కడికి చాలామంది చాలాసార్లు వెళ్తుంటారు. నా సినిమా స్క్రిప్టులన్నీ బ్యాంకాక్‌లో కూర్చునే రాశా. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ప్రశాంతంగా రాసుకుంటా. ఆ తరువాత ఓ గంట జిమ్ చేసి, షాపింగ్‌కి వెళ్తా. బ్యాంకాక్‌తో పాటు పట్టాయ్‌లో కూడా మంచి షాపింగ్‌మాల్స్ ఉన్నాయి. పట్టాయ్‌లో సెంట్రల్‌మాల్ అని ఓ పెద్ద మాల్ ఉంది. నాలుగురోజులు పడుతుంది తిరగడానికి అన్నారు.

  తనకు ప్రత్యేకంగా బ్యాంకాక్‌పైనే మోజు కు కారణం వివరిస్తూ... బ్యాంకాక్ ప్రజలు చాలా మంచివాళ్లు. అలాంటి పొలైట్‌నెస్ ఉన్నవాళ్లని నేను వరల్డ్‌లో ఎక్కడా చూడలేదు. ఒక్కో కంట్రీలో ఒక్కో తరహాలో ఉంటారు జనం. కొన్నిచోట్ల అయితే మనతో అస్సలు మాట్లాడరు. చాలా నీఛంగా చూస్తారు. ఏదైనా కొందామని అడిగినా షాపువాళ్లు రేటు కూడా చెప్పరు. అదే బ్యాంకాక్‌లో చాలా డిసిప్లిన్‌గా, హంబుల్‌గా ఉంటారు. అక్కడ ప్రతి ఒక్కరి మొహంలోనూ నవ్వు కనిపిస్తుంది. ఎవ్వరిలోనూ దురాశ కనబడదు. అక్కడ జ్వరం వస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాను. ఎందుకంటే అక్కడి హాస్పిటల్స్, ట్రీట్‌మెంట్ బావుంటాయి అన్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తన తాజా చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.

  English summary
  
 Puri Jagan's upcoming film Cameraman Gangatho Rambabu has been censored with U/A certificate. The film went for censor review on Thursday and has obtained the above certificate with no cuts. Director Puri Jagannath further said that the censor board members have appreciated the film, which is now all set for a worldwide release on October 18.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X