జర్నలిస్టులందరూ గర్వపడేలా పవన్ కళ్యాణ్

By Srikanya

హైదరాబాద్ :'పవన్‌కల్యాణ్ ఓ పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ అలరించే అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయి. జర్నలిస్టులందరూ గర్వపడేలా ఈ సినిమా వుంటుంది' అన్నారు పూరీ జగన్నాధ్. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'చిత్ర విశేషాలు పూరి జగన్నాథ్ మీడియాకు తెలియజేస్తూ ఇలా అన్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రెజిల్ సుందరి గాబ్రియాలా ఓ ఐటం సాంగ్ లో కనిపించనుంది.

పవన్‌కల్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. స్పెషల్ నైట్ ఎఫెక్ట్స్‌తో ఫైట్స్ తెరకెక్కిస్తున్నారు. మరో రెండు రోజులు అక్కడే షూటింగ్ జరుగనుంది. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత డి.వి.వి.దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం మొదటి టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేయటానికి నిర్ణయంచారని సమాచారం. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ టీజర్ అభిమానులు మధ్య విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో పుట్టిన రోజు వేడుకలు,టీజర్ విడుదల జరగనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్‌ కామెంట్‌ చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్‌కు అసలు నిద్ర పట్టడం లేదని అంటున్నారు.

ఇక ఈ చిత్రం బిజినెస్ కూడా మంచి క్రేజ్ తో మొదలైంది. అలాగే 'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. అక్టోబర్‌ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్‌ ప్లాన్‌ చేశాడు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X