'దేవుడు చేసిన మనుషులు'లో అదే చెప్తున్నాం.. పూరీ

By Srikanya

రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందించుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రం గురించి షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. ఈ చిత్రం గురించి పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ...దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్న వేసుకోవడం, సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో, ఆకలి పోగొట్టిన మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది. ఆ విషయమే మా కథలో చెబుతున్నాం అన్నారు. అలాగే చిత్రం పొగ్రెస్ వివరిస్తూ... ఇటీవల బ్యాంకాక్‌లో రవితేజ, ఇలియానా, ప్రకాష్‌ రాజ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ''రవితేజ-పూరి జగన్నాథ్‌ కలయికలో వచ్చిన చిత్రాలన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ఆ జాబితాలో మా సినిమా కూడా చేరుతుంది. బ్యాంకాక్‌ షెడ్యూలుతో టాకీ పూర్తయింది. త్వరలోనే పాటల్ని తెరకెక్కిస్తామని''అన్నారు. ఇడియట్ వంటి చాలా పెద్ద రేంజి సినిమా అవుతుంది. వాణిజ్య విలువలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. పూరి సినిమాల్లో కథానాయకుడి పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమాలోనూ అంతే. రవితేజ-పూరి కలయికలో వచ్చిన చిత్రాల్లో ఇది ప్రత్యేక స్థానం సంపాదించుకొంటుంది అన్నారు.

హీరో రవితేజ మాట్లాడుతూ... పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఇది ఐదవ చిత్రం. ఈ కథ వినగానే ఎంతో ఇన్ స్పైర్ అయ్యాను. ఈ చిత్రంలోని సన్నివేశాలు వింటూంటే ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తానా అని ఎంతో ఎక్సైట్ అయ్యాను. జగన్ కాంబినేషన్ లో మరో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అందర్ని అలరించే సినిమా అవుతుంది. జగన్ తో చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నారు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ భారీ చిత్రాల నిర్మాత చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న దేముడు చేసిన మనుష్యులు షూటింగ్ పిబ్రవరి 17 ప్రారంభమై కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటోంది.

రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం.. రఘు కుంచే, పాటలు.. భాస్కర భట్ల, ఎడిటింగ్.. ఎస్ ఆర్ శేఖర్, కథ, స్క్రీన్ ప్లే,మాటలు, దర్సకత్వం... పూరీ జగన్నాధ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X