twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదే ఉత్తమ చిత్రమని వర్మ మెచ్చుకున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ :''నా కెరీర్‌లో ఇదే ఉత్తమ చిత్రమని మా గురువుగారు రామ్‌గోపాల్‌ వర్మ మెచ్చుకొన్నారు. స్త్రీగా పుట్టి, సినిమాలంటే ఇష్టపడేవాళ్లు చూడాల్సిన సినిమా ఇది. సినిమా అంటే ఇష్టం లేకపోయినా.. సాటి స్త్రీ గురించి ఈ సినిమా చూడండి. పతాక సన్నివేశాల్లో నేను రాసిన సంభాషణలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్.

    పూరి దర్శకత్వం వహించిన చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఛార్మి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'జ్యోతిలక్ష్మీ'కి వస్తున్న స్పందన పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అలాగే... ''ఆడవాళ్లకు మగవాళ్లే కాదు, ఆడవాళ్లకు ఆడవాళ్లూ గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమా మా 'జ్యోతిలక్ష్మీ'' అన్నారు పూరి జగన్నాథ్‌.

    Puri Jagan about his latest Jyothy Laxmi

    ఛార్మి మాట్లాడుతూ ''ఈ సినిమాపై మొదట్నుంచీ చాలా నమ్మకంతో ఉన్నా. ఆ నమ్మకాన్ని ప్రేక్షకుల తీర్పు నిజం చేసింది. నన్నంతా 'జ్యోతిలక్ష్మీ' అని పిలుస్తుంటే గర్వంగా ఉంది. కుటుంబంతో కలసి చూడాల్సిన సినిమా ఇది''అన్నారు.

    ''ఇది మహిళల చిత్రమే అయినా ప్రతి మగాడూ చూడాలి. ఈ బృందంతో మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తాను''అని సి.కల్యాణ్‌ తెలిపారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'జ్యోతిలక్ష్మీ' చిత్రానికి ఛార్మి నటిగానే కాక నిర్మాతగానూ భాగం పంచుకొంది.

    ఛార్మి మాట్లాడుతూ... ''జ్యోతిలక్ష్మీ' నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమాతో నేను నిర్మాతగానూ మారా. అయితే ఇదంతా పూరి జగన్నాథ్‌గారి చలవే. ఆయనే నాపై నమ్మకం ఉంచారు. నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ కిక్‌ ఇచ్చిన సినిమా ఇది. ఎందుకంటే ఓ కొత్తబాధ్యతను నేను సమర్థంగా నిర్వహించగలను అనే ధీమా ఈ సినిమాతో వచ్చింది.

    Puri Jagan about his latest Jyothy Laxmi

    ప్రేమ, భావోద్వేగాలూ, కమర్షియల్‌ అంశాలూ.. ఇలా అన్నీ ఉన్న చిత్రమిది. ఇందులో ఓ వేశ్యగా నటించా. ఇది వరకు 'ప్రేమ ఒక మైకం'లోనూ వేశ్య పాత్రలో కనిపించా. ఈ రెండు చిత్రాలకూ చాలా తేడా ఉంది. 'జ్యోతిలక్ష్మీ'లో హీరోయిజం పండించే ఓ హీరోయిన్‌ని చూస్తారు. ఓ సామాజిక అంశంపై మహిళ చేసే పోరాటం అందరికీ నచ్చుతుంది'' అంటూ చెప్పుకొచ్చింది.

    ఇక ఈ చిత్రాన్ని 37 రోజుల్లోనే పూర్తిచేశాం. ఇదంతా పూరిగారి ప్లానింగ్‌. రోజూ టీమ్‌ని కూర్చోబెట్టుకొని సన్నివేశాల గురించి చర్చించుకొనేవాళ్లం. ఇటీవల 'జ్యోతిలక్ష్మీ'ని అందరం కలసి చూశాం. సినిమా పూర్తయ్యాక అందరి స్పందన చూసి కళ్లు చెమర్చాయి. ఎందుకంటే ఈ సినిమా విషయంలో ప్రతి విభాగంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నెరవేర్చా. అందుకే అంత ఉద్వేగానికి లోనయ్యా అంది.

    కమర్షియల్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకొన్న ఛార్మి ఆ తరవాత హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న 'మంత్ర', 'అనుకోకుండా ఓ రోజు', 'మంగళ'లాంటి చిత్రాలు నటించి గుర్తింపు తెచ్చుకొంది. ఇప్పుడు 'జ్యోతిలక్ష్మీ'గా తన 'హీరోయినిజం' చూపించడానికి ముందుకొస్తోంది.

    ఛార్మి కౌర్ ప్రధాన పాత్రలో ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్ పై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జ్యోతి లక్ష్మీ'.

    ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

    English summary
    Speaking at Jyothi Lakshmi promotional event , Puri revealed that he is very happy with this movie positive response.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X