మా అమ్మే ఆ సినిమాకు స్ఫూర్తి:పూరీ జగన్నాథ్

తన తొలి చిత్రం గురించి చెప్తూ... కథలు రాయడం... వినిపించడం... ఇదే నా పని. నేను కొత్తవాణ్ని అయినా ఆరు నెలలు కష్టపడి అపాయింట్‌మెంట్ సంపాదించా. కథ నచ్చడంతో 'నువ్వే నా దర్శకుడివి' అన్నారు. అది పెద్ద హిట్టయ్యింది. ఆ సినిమాను అమ్మ నర్సీపట్నంలో చూసి, థియేటర్ నుంచి బయటకు రాగానే ఆనందంతో నాకు ఫోన్ చేసింది. 'నాకు తెలుసురా... నువ్వు ఈ స్థాయికి వస్తావని' అంది. అదే 'బద్రి'. ఆ తరవాత నా సినిమాల గురించి చెప్పేదేముంది!
తన సినీ ప్రయాణం గురించి చెప్తూ...ప్రేమ కథలూ రాయడం మొదలుపెట్టా. స్నేహితులందర్నీ పోగేసి మా వూళ్లో 'మృదంగం' అనే నాటకం ప్రదర్శించా. అంతా ప్రశంసించారు. అమ్మ సంతోషపడింది. 'ఇక్కడే ఉంటే నువ్వు బాగు పడవ్.. హైదరాబాద్ వెళ్లి సినిమాల్లో ప్రయత్నం చెయ్..' అంటూ చేతిలో కొంత డబ్బు పెట్టింది. అమ్మానాన్నా కష్టపడి దాచుకున్న ఇరవై వేల రూపాయలిచ్చి ఆ రోజు పంపకపోయుంటే 'బద్రి' లేదు... 'బిజినెస్‌మెన్' లేదు. 'పోకిరి'గా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాణ్ని అన్నారు.


Click it and Unblock the Notifications











