పూరీ జగన్నాధ్ కథ సమకూరుస్తూ,వి.వి.వినాయిక్ స్క్రీన్ ప్లే అందిస్తే ఎలా ఉంటుంది. త్వరలో కెమెరామెన్ ఛోటా కె.నాయుడు ని డైరక్టర్ గా పరిచయం చేస్తూ ఆదిత్యారామ్ నిర్మించబోతున్న చిత్రంలో ఆ అధ్బుతం జరగబోతోంది. సందడే సందడి,స్వాగంతం వంటి చిత్రాలు నిర్మించిన ఆదిత్యారామ్ తన ఆదిత్యా గ్రూప్ స్ధాపించి పదిహేనేళ్ళు అయిన సందర్భంగా పూరీ జగన్నాధ్ తో కలసి ఈ ప్రయోగం చెయ్యబోతున్నారు.ఈ విషయాన్నిపూరీ తన ఆపీసులో ఈ రోజు(శుక్రవారం)ఉదయం మీడియాకు తెలియచేసారు. ఇక ఈ చిత్రంలో పాటు మరో తొమ్మిది చిత్రాలు రాబోయో రెండేళ్ళలో నిర్మిస్తారు.మిగతా చిత్రాలను పరుశరామ్(యువత ఫేం),వి.వి.వినాయిక్,శ్రీను వైట్ల రూపొందిస్తారు. అలాగే మొదటి సినిమా కోతులను పూరీ దర్శకత్వంలో రూపొందిస్తారు. ఇందులో పూరి సోదరుడు శాయిరామ్ శంకర్,బిందు మాధవ్ కాంబినేషన్ తో రూపొందిస్తారు.