‘బిజినెస్ మ్యాన్’ ఆడియోకి పూరీనే...
ఈ నెల 22న తెలుగు, తమిళ్, మలయాళంలో 'బిజినెస్ మ్యాన్'ఆడియో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఆడియో కార్యక్రమానికి పూరి జగన్నాథ్ యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణ కానున్నదని సమాచారం. పూరీనే యాంకరింగ్ చేయటానికి మహేష్ ఒప్పించినట్లు సమాచారం. ఇక ఈ ఆడియోలో పూరీ,మహేష్ లు ఓ పాట పాడారు. 'దూకుడు' తర్వాత థమన్ మరో సారి మ్యూజిక్‌లో మ్యాజిక్ చేసిన చిత్రం ఇది. అలాగే ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తా'.. 'బిజినెస్‌మేన్' ప్రోమోలో మహేష్ చెప్పిన ఈ డైలాగ్‌కి జనాల్లో విపరీతమైన క్రేజు వచ్చింది. పూరి మార్క్ సంభాషణలతో, మహేష్ మార్క్ స్టైల్‌తో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డావెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి.గతంలో మహేష్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో విడుదల అవనున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో విజేతగా నిలిచి దూకుడు రికార్డులను బ్రద్దలు కొడుతుందని మహేష్ ఫ్యాన్స్ సైతం ఆశలు పెట్టుకున్నారు. ఇక మహేష్ కి తెలుగు సహా తమిళ్‌లోనూ భారీ మార్కెట్ ఉంది.


Click it and Unblock the Notifications











