»   » హ్యాపీ న్యూస్ : మహేష్ తో సినిమా గురించి పూరి ట్వీట్

హ్యాపీ న్యూస్ : మహేష్ తో సినిమా గురించి పూరి ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : " మహేష్ ఫ్యాన్స్ తో ఇది షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మహేష్,నా కాంబినేషన్ లో రూపొందే 3 వ చిత్రానికి స్క్రిప్టు ఫినిష్ చేసాను..హ్యట్రిక్ కు రెడీగా ఉండండి ", అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేసారు. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్వరలో ఓ చిత్రం సెట్స్‌పైకి రానుందనే సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన పోకిరి, బిజినెస్‌మేన్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ సినిమాల తరువాత ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందని ఈ ట్వీట్ తో ఖరారు చేసారు పూరి. ఆ ట్వీట్ ఏమిటంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చిరంజీవితో పూరి జగన్నాధ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల అనంతరం వచ్చే ఏడాది మహేష్, పూరి జగన్నాథ్‌ల చిత్రం సెట్స్‌పైకి రానుందని చిత్ర వర్గాల సమాచారం.

చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడి ఒకరోజు కూడా గడవక ముందే ఆ సినిమాపై వివాదాలు మొదలైపోయాయి. ఆ సినిమా కథ ఒరిజినల్‌ కాదనీ, అది కాపీ కొట్టారనే ఆరోపణలు వచ్చాయి.

దీనిపై దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నా ఆలోచనల నుంచి తయారైన అసలు కథ. కొంతమంది మీడియా ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు.

Puri Jagan announces Mahesh movie!!

తన స్ర్కిప్ట్‌ ‘ఒక్క అడుగు'లోని ప్రధానాంశాన్ని బీవీఎస్‌ రవి కాపీ కొట్టారంటూ యు.ఎస్‌.కు చెందిన స్ర్కీన్‌ప్లే రైటర్ వాసుదేవ్‌ వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే. దానికి గోపిమోహన్ ముందుగానే స్పందించాడు.. ‘‘ఇంకొకరి కథను నేను బీవీఎస్‌ రవితో షేర్‌ చేసుకున్నానే వార్తలో నిజం లేదు. వాళ్లెవరైనా కానీ, ఏదైనా సమస్య ఉంటే రచయితల సంఘం దగ్గర పరిష్కరించుకోవచ్చు.'' అని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

ఇక మహేష్, కొరటాల శివ చిత్రం విషయానికి వస్తే...

ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.

English summary
“Vry happy to share vit all Mahesh fans , just now finalised script for our 3rd film together .. Getting ready for hatrick”, said Puri, after Mahesh okayed the project.
Please Wait while comments are loading...