దేముడున్నాడని నమ్మి చూడండి: పూరీ జగన్నాధ్
దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ...దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి అనే కార్డ్ వచ్చిన తర్వాత సినిమా స్టార్ అవుతుంది. హండ్రెడ్ పర్శంట్ ఎంటర్టైనర్ ఇది. నాకు రవితేజ కాంబినేషన్ లో చాలా మంచి హిట్ సినిమా అవుతుంది అన్నారు. ఆయన తాజా చిత్రం దేముడు చేసిన మనుష్యులు ఈ రోజే ఓపినింగ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆయన ఇలా స్పందించారు.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ భారీ చిత్రాల నిర్మాత చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న దేముడు చేసిన మనుష్యులు షూటింగ్ పిబ్రవరి 17 అంటే ఈ రోజు న పూరీ జగన్నాధ్ ఆపీసులో ప్రారంభమైంది. రవితేజ దేవుని పటాలకు నమస్కరించటాన్ని తొలిషాట్ గా చిత్రీకరించారు. ఈ ముహూర్తం షాట్ కు మరో డైరక్టర్ వివి వినాయిక్ క్లాప్ ఇవ్వగా,కో ప్రొడ్యూసర్ బోగవల్లి బాపినీడు కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ...పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఇది ఐదవ చిత్రం. ఈ కథ వినగానే ఎంతో ఇన్ స్పైర్ అయ్యాను. ఈ చిత్రంలోని సన్నివేశాలు వింటూంటే ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తానా అని ఎంతో ఎక్సైట్ అయ్యాను. జగన్ కాంబినేషన్ లో మరో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అందర్ని అలరించే సినిమా అవుతుంది. జగన్ తో చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నారు.
నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ..ఇడియట్ వంటి చాలా పెద్ద రేంజి సినిమా అవుతుంది. ఈ దేముడు చేసిన మనుష్యులు మార్చి రెండు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్టవుతుంది. జూన్ లో రిలీజ్ ప్లాన్ చేస్తాం అన్నారు.
రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే, పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్ ఆర్ శేఖర్. కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్సకత్వం...పూరీ జగన్నాధ్.


Click it and Unblock the Notifications











