»   » ‘టెంపర్’ రిలీజైన వెంటనే వరుణ్ తేజ్ మూవీ షురూ

‘టెంపర్’ రిలీజైన వెంటనే వరుణ్ తేజ్ మూవీ షురూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ‘టెంపర్' మూవీ ఫినిషింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం త్వరలో సెన్సార్ కు వెళ్లబోతోంది. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలైన వెంటనే వరుణ్ తేజ్‌తో సినిమా చేయబానికి రెడీ అవుతున్నారు పూరి. సి.కళ్యాణ్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు చేసారు.

వరుణ్ తేజ్ ఇటీవలే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే వరుణ్ తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని పెర్ఫార్మెన్స్, లుక్స్ బావున్నాయని, భవిష్యత్తులో మంచి స్తాయికి ఎదుగుతాడని అంటున్నారంతా.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Puri Jagan confirms his next with Varun Tej

త్వరలో పూరి ప్రేక్షకుల మీదకు వదల బోతున్న ‘టెంపర్' సినిమా విషయానికొస్తే...ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానుంది.

ఈచిత్రాన్ని వెస్ట్ గోదావరిలో పూరి జగన్నాథ్ స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన పాపుల డిస్ట్రిబ్యూటర్ సురేస్ మూవీస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా రైట్స్ కోసం పూరి జగన్నాథ్ రూ. 2 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని....ఇంత రేటు పెట్టి మరీ పూరి జగన్నాథ్ కొనడం హాట్ టాపిక్ అయింది. సినిమాపై ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇలా చేసాడని అంటున్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది ఉంది. ‘టెంపర్' చిత్రం చివరి షెడ్యూల్‌కు నిర్మాత బండ్ల గణేష్ డబ్బులు ఇవ్వలేదని, పూరి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడని, అందుకే నిర్మాత ఇలా సెటిల్మెంట్ చేసాడని కొందరు అంటున్నారు. ఇందులో నిజమెంతో తేలాల్సి ఉంది.

English summary
Puri Jagan will direct Varun’s second film. This project is now officially confirmed and will be produced by C Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu