టైటిల్ పెట్టింది పూరీ జగన్నాధ్

By Srikanya

హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ డైలాగులు కన్నా పాపులర్ అయ్యినవి ఆయన చిత్రాల టైటిల్స్. విభిన్నంగా ఆలోచించి పెట్టే ఆయన టైటిల్స్ జనసామాన్యంలోకి దూసుకుపోతూంటాయి. తాజాగా ఆయన తను డైరక్ట్ చేయని మరో చిత్రానికి టైటిల్ పెట్టారు. ఆ చిత్రం మరోదో కాదు 'ఉలవచారు బిరియానీ'. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు ప్రకాష్ రాజ్ స్వయంగా తెలియచేసారు. ప్రకాష్ రాజ్ 'ఉలవచారు బిరియానీ' అంటూ కొత్త రుచులు వడ్డించబోతున్నారు. ఈ చిత్రం వచ్చేనెల 6న విడుదల కాబోతోంది.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... 'ఈ సినిమాకి పేరు పెట్టింది నా మిత్రుడు, దర్శకుడు.. పూరి జగన్నాథ్‌. ఓ రోజు ఫ్త్లెట్‌ లో ప్రయాణిస్తుంటే 'ఉలవచారు బిరియానీ' అనే పేరు బాగుంటుంది పెట్టుకోండి.. అన్నాడు. పేరులోనే కాదు.. కథలోనూ చాలా రుచులున్నాయి. ప్రేమ, ఆకలి ఇవి రెండూ అందరూ అనుభవించాల్సిందే. దానికి వినోదం కూడా కలిపి వడ్డిస్తున్నాం. రుచి, ప్రేమ, బంధం కలబోసిన ఓ రుచికరమైన కలయిక ఈ చిత్రం...' అని చెప్పారు.

అలాగే... ''మలయాళంలో 'సాల్ట్‌పెప్పర్‌' చూశాను. 'అరె.. ఇరవై ఆరేళ్ల కుర్రాడు భలే తీశాడు..' అనిపించింది. ఆ కథకు నా ఆలోచనల్ని, నా అనుభవాల్ని జోడించి చెప్పాలనుకొన్నా. అందుకే తెలుగు, తమిళం, కన్నడం, హిందీ హక్కుల్ని కొన్నా. కొన్ని రోజులకు కె.ఎస్‌.రామారావుగారి దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది 'సాల్ట్‌పెప్పర్‌ తెలుగులో తీద్దామనుకొంటున్నా. ఆ హక్కులు మీ దగ్గరుండిపోయాయి..' అన్నారు. 'సార్‌.. నేను తీస్తున్నానండీ..' అని చెప్పా. కానీ నా మనసు ఒప్పుకోలేదు. 'అంత పెద్ద మనిషి అడిగితే ఇలా అన్నానేంటి..' అనుకొని మళ్లీ ఆయనకు ఫోన్‌ చేసి 'మీకు అభ్యంతరం లేకపోతే ఆ సినిమా మీ బ్యానర్‌లో తీస్తా' అని అడిగా. ఆయనా ఆనందంగా ఒప్పుకొన్నారు. అలా ఈ సినిమా మొదలైంది'' అని చెప్పారు.

Puri Jagan gave title to Prakash Raj

కె.ఎస్.రామారావు మాట్లాడుతూ "సెన్సార్ పూర్తయింది. జూన్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇళయరాజాగారి పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది'' అని అన్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. స్నేహ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించటం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మళయాళంలో విజయవంతమైన చిత్రం కావటంతో ఇక్కడా అదే రేంజిని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ అధినేత కె.ఎస్.రామారావు సమర్పిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. వల్లభ ర్మిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త కీలక పాత్రధారులు. ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య, కోటేష్ మన్నన, శివాజీరావు యాదవ్, విజయ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, కెమెరా: ప్రీతా జయరామన్, ఆర్ట్: కదిర్, ఎడిటింగ్: హర్ష, దర్శకత్వం: ప్రకాష్‌రాజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X