»   » బ్యాంకాక్‌లో జూ ఎన్టీఆర్ కోసం పూరి కుస్తీ!

బ్యాంకాక్‌లో జూ ఎన్టీఆర్ కోసం పూరి కుస్తీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఆంధ్రావాలా' చిత్రం తర్వాత దాదాపు పదేళ్ల గ్యాప్ తీసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్‌లు త్వరలో మరో సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూ ఎన్టీఆర్ పూరి చెప్పిన స్టోరీ లైన్‌కు ఓకే చెప్పేసాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో మకాం వేసినట్లు తెలుస్తోంది.

తన సినిమాకు సంబంధించిన స్క్రిప్టు, డైలాగులు, స్టోరీ సొంతగానే ప్రిపేర్ చేసుకునే పూరి జగన్నాథ్...... బ్యాంకాక్ వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు మకాం వేసి పూర్తి చేయడం అలవాటు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం పూరి బ్యాంకాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు పూరి.

Puri Jagan is heading to Bangkok

ఏప్రిల్ నెలలోనే జూ ఎన్టీఆర్-పూరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. త్వరలోనే ఈచిత్రానికి హీరోయిన్ ఎవరు? ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం 'రామయ్యా వస్తావయ్య' గత సంవత్సరం అక్టోబర్లో విడుదలైంది. ఆ తర్వాత ఆయన కమిటైన 'రభస' చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. అయితే అనుకోని కారణాలతో ఈ చిత్రం లేటవుతూ వస్తోంది.

English summary
NTR and Puri Jagannadh will work together again after Andhrawala and the new film will commence shoot from April. Now, here is the latest buzz that Puri Jagan is heading to his favorite destination Bangkok for working on the script.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu