twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రెండ్ ని వాడుకునే లత్కోరు క్యారెక్టర్ ..పూరీ జగన్నాధ్

    By Srikanya
    |

    పూరీ జగన్నాధ్ తాజాగా ప్రెండ్ ని వాడుకునే లత్కోర్ క్యారెక్టర్ వీడిది అన్నారు. అయితే అది పూరీ జగన్నాధ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న డిస్కో కోసం చెప్పిన మాటలు ఇవి. నిఖిల్ హీరోగా వస్తున్న డిస్కో చిత్రం మొదట్లో ఈ వాయిస్ ఓవర్ వస్తుంది. హీరో ఇంట్రడక్షన్ కోసం పూరీ ఈ డైలాగుని చెప్తారు. ఈ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌ శిష్యుడు హరి కె.చందూరి కావటంతో ఈ వాయిస్ ఓవర్ ని ఇస్తున్నారు. గతంలోనూ పూరీ ..నిఖిల్ నటించిన యువత చిత్రానికి వాయిస్ ఇచ్చారు. అలాగే మహేష్ బిజినెస్ మ్యాన్ చిత్రంలోనూ ఆయన ధీమ్ సాంగ్ పాడారు. ఇక ఈ వాయిస్ ఓవర్ రికార్డింగ్ నిన్న(మార్చి 10)శనివారం జరిగింది. ఈ విషయమై నిఖిల్ మాట్లాడుతూ...పూరీ సార్ నాకు ఇంట్రడక్షన్ ఇస్తూ వాయిస్ ఓవర్ చెప్పటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సినిమా బిగినింగ్ లో వస్తుందీ వాయిస్ అన్నాడు. చిత్ర దర్సఖుడు హరి కె.చందూరి మాట్లాడుతూ... మాగురువుగారి నేమ్‌, ఫేమ్‌ నిలబెట్టే స్థాయిలో దర్శకత్వం వహించాను అని భావిస్తున్నాను. యూత్ హీరోల్లో జోరుమీద ఉన్న నిఖిల్‌ ఖాతాలో మా 'డిస్కో' చేరుతుందని, హిట్‌ సినిమా అవుతుంది. ఇప్పటికే నిఖిల్‌ 'యువత', 'వీడుతేడా' వంటి హిట్స్‌తో యువప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రాలకు ఫాలో అప్‌ చిత్రంగా 'డిస్కో' ఉంటుంది. వ్యయం పరంగా అధిక బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తీస్తున్న చిత్రమిది అన్నారు. నిఖిల్‌, సారాశర్మ, ఎమ్మెస్‌.నారాయణ, అలీ, విజయ్‌, ఖయ్యూం, వంశీకృష్ణ, అశిష్‌విద్యార్థి, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: సతీష్‌ మల్లంపాటి, ఛాయాగ్రహణం: జోషి మల్హర్‌భట్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: యామినీ మాథ్యూస్‌, నిర్మాత: కె.అభినవ్‌రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి.కె.చందూరి.

    English summary
    Director Puri Jagannadh has given voice-over to his disciple Hari K. Chanduri's maiden movie, Disco, starring Nikhil in the lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X