పవన్ కళ్యాణ్‌తో పూరి జగన్నాధ్ సినిమా
ఒకరేమో పవర్ స్టార్ పవన్ కళ్యాన్, ఒకరేమో క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులదరికీ పండగే మరి. అభిమానుల ఈ కల త్వరలోనే నిజం కాబోతోంది. బిజినెస్ మేన్ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న పూరి జగన్నాథ్ త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తానని తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. గతంలో పూరి-పవన్ కాంబినేషన్లో 'బద్రి' సినిమా వచ్చింది. అప్పట్లో బద్రి సినిమా సంచలన విజయం సాధించింది. వపన్ కెరీర్ లోనే ఆ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. తాజాగా మరో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.
మరి పూరి-పవన్ సినిమా ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటి నుంచే పరిశ్రమలో చర్చ మొదలైంది. మాఫియా నేపథ్యం ఉంటుందా? యూత్ ఫుల్ గా ఉంటుందా? లేక ఇది వరకెన్నడూ లేని వైవిధ్య భరితంగా సినిమా ఉంటుందా? ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్-పూరి సినిమా అంటే అంచనాలు భారీగా పెరగడం ఖాయం. ఇక రికార్డుల సంగతి చెప్పక్కర్లేదు.
ప్రస్తుతం పవన్ కళ్యాన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' సినిమా చే్స్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హిందీ సూపర్ హిట్ మూవీ దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











