చిరు సినీ రిటైర్మెంట్ పై పూరీ జగన్నాధ్ ఘాటు స్పందన

By Srikanya

చిరంజీవిగారు సినిమాల్లో మళ్ళీ నటించేందుకు ఒప్పుకుంటే అన్నయ్య కోసం కథ రాస్తాను.డైరక్ట్ చేస్తాను అంటున్నాడు పూరీ జగన్నాధ్.అలాగే చిరంజీవి కూడా బాధ పడే ఉంటారు. నిన్న రామ్ గోపాల్ వర్మ ఓ మాటన్నారు చిరంజీవి గారి సినిమా టిక్కెట్లు కోసం రాష్ట్త్రంలో అందరూ లైన్ లో నించున్నారు కానీ ఆయన్ని సిఎం చేయటం కోసం ఎవరూ క్యూలో నిలుచోలేదు.అలాంటి వారి కోసం సినిమా ఎందుకు వదిలేయాలి అన్నారు.అది హండ్రెడ్ పర్శంట్ కరెక్టు.ఆయన ఊ అంటే ఇప్పుడే కథ రాస్తాను..150 సినిమా చేస్తాను అన్నారు.

చిరంజీవిగారు సినిమా బాలీవుడ్ మెగా..స్టార్ సినిమా చేయగలిగాను కానీ టాలీవుడ్ మెగాస్టార్ తో సినిమా చేయలేకపోతున్నాను అని ఆయన బాధపడ్డారు. అలాగే సినిమాలు చేయనని ఆయన చెప్పటం భావ్యం కాదమో.ఆయన్ని అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. వారికోసం చిరంజీవి మనస్సు మార్చుకుంటే చిరు కోసం కథ తయారు చేస్తానని ప్రకటించారు. చిరంజీవి ఇక సినిమాలు చేయనని తనను ప్రజలు ముఖ్యమంత్రిగా నిజ జీవితంలో చూడాలనుకుంటున్నారని,తెరమీదని నిక్కచ్చిగా చెప్పి తను సినీ జీవితానికి రిటైర్ మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించటంతో అన్ని చోట్ల నుంచి ఈ తరహా వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. ఇక పూరీ జగన్నాధ్ మాటలు విని చిరంజీవి సంతోషిస్తారో లేక పూరి కథ తయారు చేస్తాడని విరమించుకుని వస్తాడో చూడాలి.అయినా డైరక్టర్స్ ,కథలు దొరక్క కాదుకదా చిరంజీవి సినిమాలు చేయనని రిటైర్మెంట్ తీసుకున్నది. ఏమంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X