హాట్ న్యూస్: ‘...రాంబాబు' స్టోరీ రివిల్ చేసిన పూరీ జగన్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ రోజు(మంగళవారం)మీడియా సమావేశం జరగింది. ఈ మీడియా సమావేశంలో పూరీ జగన్ మాట్లాడుతూ ఈ చిత్రం కథని రివిల్ చేసారు. ఆయన మాటల్లో... రాంబాబు అనే జర్నలిస్ట్ రానా బాబు అనే రాజకీయ నాయకుడి తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపిస్తున్నాం. రాంబాబు పాత్రని పవన్ కళ్యాణ్ చేస్తూంటే, రానా బాబు పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు.
ఇక చిత్రంలో పవన్ కళ్యాణ్ చేసన రాంబాబు పాత్రను గురించి చెబుతూ...: పేపర్లో, టీవీలో న్యూస్ చూసి స్పందించే కుర్రాడు జర్నలిస్ట్ అయితే ఎలా ఉంటుందో రాంబాబు పాత్ర అలా ఉంటుంది. మన రాష్ట్రంలో వచ్చిన ఒక పెద్ద సమస్యని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది సినిమా కథ అన్నారు. అలాగే ఈ సినిమా కథ నాలుగేళ్ళ క్రితం రాసుకున్నాను. మొదట రవితేజకి వినిపించాను. కథ విన్న వెంటనే ఈ సినిమా కళ్యాణ్ గారితో చేస్తే పెద్ద హిట్ అవుతుంది అన్నాడు.
బద్రీ తర్వాత నేను చాలా రోజులుగా కళ్యాణ్ తో సినిమా చేద్దాం అనుకుంటూ వస్తున్నాను కాని కుదరలేదు. సరే ఈ కథ చెప్పి చూద్దాం అని చెప్పాను. పవన్ కి ఈ సినిమా కథ, కంటెంట్, రాంబాబు పాత్ర చాలా బాగా నచ్చి వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాడు. ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి అన్నారు.
ఈ నెల 18న విడుదలవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్లో ఉంది. ఈ వారాంతంలో సెన్సార్ చేసి అక్టోబర్ 18న భారీ ఎత్తున విడుదల మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి నేను ఒక్క కరెక్షన్ చేయలేదు, అంత బాగా ఇచ్చాడు మణిశర్మ. నేను తమన్నాతో ఫస్ట్ టైం కలిసి పని చేశాను. కెమెరామన్ గంగగా చాలా బాగా చేసింది. తన పాత్ర టామ్ బాయ్ లాగా ఉంటుంది. అందుకే కెమెరా వుమెన్ అని కాకుండా కెమెరామెన్ అని పెట్టాము. ఈ సినిమాతో మా హీరో, హీరొయిన్ ఇద్దరికీ నంది, ఫిలిం ఫేర్ లాంటి అవార్డ్స్ అన్ని రావాల్సిందే అని తెలిపారు.


Click it and Unblock the Notifications











