»   » ఇదీ పూరీ జగన్నాథ్ గుహ(ఫొటో)

ఇదీ పూరీ జగన్నాథ్ గుహ(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చాలా కాలం పాటు స్టార్ హోటల్స్ లో కంటిన్యూగా వర్క్ చేస్తూ అక్కడే ఉన్న పూరి జగన్నాథ్ తన ఆఫీస్ ను కూడా అదే మోడల్ లో డిజైన్ చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 34 లో ఆయన తన కొత్త ఆఫీసుని తనకు ఇష్టమైన రీతిలో 18000 స్వ్కైర్ ఫీట్ లో దాదాపు ఇరవై కోట్లు వరకూ ఖర్చు పెట్టి కట్టించుకున్నారు. ఈ ఇంటికి ఆయన కేవ్(గుహ) అని పేరు పెట్టారు.

తెలుగు ఇండస్ట్రీ లో ఈ ఆఫీసు ఒక ఆకర్షణ గా మారింది. పని దాదాపు పూర్తి కావొచ్చిన ఈ ఆఫీస్ ని ఇటివలే లాంచనంగా ప్రారంభించారు. ఇక్కడ ప్రొడక్షన్ నుంచి మినీ థియోటర్స్ వరకూ అన్నీ ఉన్నాయి. ఇదొక అపురూపమైన ఆఫీస్ గా అందరూ అభివర్ణిస్తున్నారు. సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటుందా ఎక్కడకైనా వెళ్లిపోతుందా అని డైలమోలతో తెలుగు పరిశ్రమ ఊగిసలాడుతున్న నేపధ్యంలో ఇలా ఆఫీస్ పెట్టడం...అదీ భారీ స్ధాయిలో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

Puri Jagan's office is the richest office in Tollywood

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..." ఇది నా పర్శనల్ స్పెస్.. ఆదివారం నాడు దీన్ని ఓపెన్ చేసాను. వర్మ, ప్రకాష్ రాజ్ వంటి కొంతమంది సన్నిహతులకు ఇచ్చిన పార్టీతో దీన్ని ప్రారంభించాను. ఈ హోమ్ స్టూడియో మొత్తం నాకు సంభందించిందే. దీన్ని నేను ఇల్లు, ఆఫీసు,రిసార్ట్, లాంచ్ ఇలా ఏదైనా పేరుతో పిలవవచ్చు. ఇది నిర్ణించటానికి నాకు ఓ సంవత్సరం పైన ఒక నెల పాటు కాలం పట్టింది. దీన్ని నేను గుహ(కేవ్) అని పిలుస్తాను. ఈ ప్రపంచమే పెద్ద అడవి. ఇక్కడ నేను ఓ జంతువుని, నేను చివరకు నేను నా గుహను ఏర్పాటు చేసుకున్నాను అన్నారు. ."

English summary
Puri Jagannath says, “This is my personal space and I opened it on Sunday, with a party for RGV, Prakash Raj and a few others. This home studio is all about me. I can call it an office, home, resort, lounge... you name it. It took over a year, and a month to build. And I’m calling it the ‘Cave’ because the world is a jungle, I’m an animal and I finally, have my own cave.”
Please Wait while comments are loading...