»   » మరో సినిమాకి పూరి జగన్నాథ్ వాయస్ ఓవర్

మరో సినిమాకి పూరి జగన్నాథ్ వాయస్ ఓవర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : గతంలో డిస్కో చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ ...మరో చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి సిద్దమవుతున్నారు. శ్రీకాంత్‌ హీరోగా జర్నలిస్ట్‌ ప్రభును దర్శకునిగా పరిచయం చేస్తూ రాజరాజేశ్వరి పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రానికి 'మొండోడు' అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి పూరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

'మొండోడు' రాజు కన్నా బలవంతుడు అన్న సామెత చందాన..ఈ చిత్రంలో హీరో కూడా మంచి కోసం, తనకు నచ్చిన పని చేయటంకోసం, తనను నమ్మిన, తాను నమ్మిన వారికోసం ఎంతకైనా తెగించే మనిషి. ఈ విషయంలో ఎవరినీ లెక్కచేయని మొండితనం అతని సొంతం. హీరో పాత్ర తీరు తెన్నులు, స్వరూప స్వభావాలను బట్టి చిత్రానికి 'మొండోడు' అనే పేరును నిర్ణయించామన్నారు.యాక్షన్‌.సెంటిమెంట్‌ నేపధ్యంలో జరిగే ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు జర్నలిస్ట్‌ ప్రభు అన్నారు.

నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ' ప్రస్తుతం ఫిలింసిటీలో శ్రీకాంత్‌పై ఓ సందర్భోచిత గీతాన్ని స్వర్ణ మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నాము. అలాగే హీరో చిన్నతనానికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించాము. ఎడిటింగ్‌ వర్క్‌ కూడా ప్రారంభమయింది. ఈ నెల 28 నుంచి డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారం భమవుతాయి. జులై నెలాఖరున గానీ,ఆగస్టు ప్రధమార్ధంలో గానీ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నట్లు నిర్మాత తెలిపారు.

హీరో శ్రీకాంత్‌ దొంగగా, హీరోయిన్ టీచర్‌గా కనిపించే ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో పోసాని కృష్ణమురళి, చిత్రం శ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు. కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, సంగీతం: సాయికార్తీక్, పాటలు: శ్యాం కాసర్ల, ఎడిటింగ్: నాగిరెడ్డి, సమర్పణ: జ్యోత్స్నారెడ్డి, నిర్మాత: రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు.

English summary
Director Puri Jagan has given his voice for some films in the past. He has agreed to do that again for family hero Srikanth’s upcoming film ‘Mondodu’. The shooting of the film has been completed and Puri Jagan’s voice over is expected to be a special attraction for the movie. Former journalist Prabhu has directed this movie.
Please Wait while comments are loading...