పూరి తనయుడి ఫస్ట్ లుక్, వీల్ చైర్లో..
దర్శకుడు పూరి జగన్నాథ్ తన వారసుడు ఆకాష్ ను ఇప్పటి నుంచే స్టార్ గా తీర్చి దిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. ఇదివరకే తన సినిమాల ద్వారా ఆకాష్ ను చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం చేసిన పూరి ఏ చిన్న అవకాశం దొరికినా ఆకాష్ ను పరిశ్రమలో ఎక్స్ ఫోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆకాష్ ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ధోనీ' చిత్రంలో ఆకాష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఆకాష్ ధోనీలా గొప్ప క్రికెటర్ కావాలని కలలుగనే బాలుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. పక్క ఫోటోలో చూశారుగా... ఆకాష్ వీల్ చైర్ లో కూర్చుని అంగ వైకల్యంతో ఉన్నట్లు ఉంది కదూ...
ప్రస్తుతం ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ధోనీ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలయరాజా సంగీతం అందించారు. ఈ నెలలోనే చిత్ర ఆడియో విడుదల కానుంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కె.వి.గుహన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.


Click it and Unblock the Notifications











