twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు తెలియకుండా కళ్లు చెమర్చాయి...పూరీ జగన్నాధ్

    By Srikanya
    |

    ఈ చిత్రం షూటింగ్ ఆరంభించిన 15 రోజులకు ఓరోజు వ్యాన్‌లో కూర్చుని భోజనం చేస్తున్నాను. ''మనమేంటి? అమితాబ్ బచ్చన్ సినిమాకి డెరైక్షన్ చేయడం ఏంటి?"" అనిపించింది. ఆ వెంటనే నాకు తెలియకుండా కళ్లు చెమర్చాయి అంటూ ఎమోషన్ పీలయ్యారు దర్సకుడు పూరీ జగన్నాధ్. అమితాబ్ బచ్చన్ హీరోగా హిందీలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బుడ్డా" శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే ఆ సినిమా ఓకే అయిన విధానం వివరిస్తూ ...''నేను అమిత్‌జీకి అభిమానిని. ఆయనతో సినిమా తీస్తానని ఏనాడూ ఊహించలేదు. ఇంగ్లిష్ చిత్రం 'టేకెన్" చూసిన తర్వాత ఆర్జీవీ (రామ్‌గోపాల్‌వర్మ)కి ఫోన్ చేసి అమితాబ్ గారితో సినిమా తీయాలని ఉందంటే కథ రెడీ చేసుకోమన్నారు.

    ఆ తర్వాత ఆయనే స్వయంగా అమిత్‌జీకి పరిచయం చేస్తే, కథ చెప్పాను. కథ మొత్తం విన్న తర్వాత కొన్ని సందేహాలున్నాయని అమిత్‌జీ అన్నప్పుడు 'తనని నమ్మండి. బ్లాక్ బస్టర్ ఇస్తాడు" అని ఆర్జీవీ నమ్మకంగా చెప్పారు.ఆర్జీవీ మీద నమ్మకంతో మరో మాట మాట్లాడకుండా అమిత్‌జీ ఈ చిత్రంలో నటించారు. అమిత్‌జీని నా ఇష్టానికి తగ్గట్టు చూపించాలనే కసితో, సరదాతో 'బుడ్డా" చేశాను.

    అమిత్‌జీ (అమితాబ్ బచ్చన్)తో సినిమా చేయాలన్నది నా కల. ఆ కల రామ్‌గోపాల్ వర్మవల్ల నెరవేరింది అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రకథ గురించి చెప్పాలంటే... అమిత్‌జీ పాత్ర పేరు 'విజ్జు". ముంబైకి చెందిన ఓ పాత గ్యాంగ్‌స్టర్. పోలీసు కేసుల్లో ఇరుక్కుని.. అందులోంచి బయటపడి పారిస్ వెళ్లి పబ్ నడుపుతుంటాడు.మళ్లీ ఒక ప్రత్యేకమైన మిషన్ మీద విజ్జు ముంబై వస్తాడు. అనంతరం ఏం జరిగింది? అనేదే 'బుడ్డా" అన్నారు.

    English summary
    In the movie Amitabh Bachchan reprises the famous "Vijay" that he has played in popular films like Deewar, Agneepath and Zanjeer. He essays the role of a retired Hitman settled in Paris who comes back to India to do "one last job". During the course he comes face to face with his past and that gets him to change his motive for the 'hit'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X