పూరీ జగన్నాధ్ సెకెండ్ సెటప్ప్ లు
గోలీమార్ చిత్రం వచ్చిన గ్యాప్ తో భయపడ్డాడో మరేమో కానీ పూరి జగన్నాధ్ వరసగా సినిమాలు ఎనౌన్స్ చేసేస్తున్నాడు.తన భవిష్యత్ ని సెటప్ చేసేసుకుంటున్నాడు. అయితే ఆ సినిమాలన్ని అంతకుముందు చేసిన హీరోలతోనే కావటం విశేషం.వీటినే ఇండస్ట్రీలో సెకెండ్ సెటప్ లు అని ముద్దుగా పిలుస్తూంటారు.అందులో మొదటగా పోకిరితో హిట్ ఇచ్చిన మహేష్ తో ది బిజెనిస్ మ్యాన్ కాగా రెండవది తన ఆస్దాన హీరోగా వెలిగిన రవితేజాతో ఇడియట్ సీక్వెల్,అలాగే ఆంధ్రావాలా చేసిన ఎన్టీఆర్ తో మరో చిత్రం ప్రకటించాడు.
ఇక రాబోయే రోజుల్లో ప్రబాస్ తోనూ,గోపీచంద్ తోనూ,అల్లు అర్జున్,రామ్ చరణ్ బ్యాలెన్స్ ఉన్నారు.వారితోనూ సినిమాలు ప్రకటించే అవకాసం ఉంది.ఒక రౌండ్ వీళ్ళందరితో అయిపోయిన పూరీ తన సెకెండ్ రౌండ్ కి రెడీ అవుతున్నాడు.ఒక రకంగా సినిమా తర్వత సినిమా ఒప్పుకోవటం ద్వారా తనను తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.అందులోనూ హిందిలో బుడ్డాతో క్రేజ్ వస్తుంది వరస సినిమాలు వస్తాయి అనుకుంటే ఒక్క ఆఫర్ కూడా రాలేదు.దాంతో ఈ స్టాటజీ ని ఫాలో అవుతున్నాడు.మరి ఈ సెకెండ్ సెటప్ లు అన్నీ కూడా వర్కవుట్ అయితే మళ్ళీ పూరీనే నెంబర్ వన్ ప్లేసులో ఉంటాడం ఖాయం.


Click it and Unblock the Notifications











