Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అాలాంటి మాటలు అంటే నమ్మకండి.. పూరీ జగన్నాథ్ కామెంట్స్ వైరల్
జీవిత సారాన్ని ఒక్క మాటలో చెప్పడం అంటే మామూలు విషయం కాదు. తూటాల్లాంటి మాటలను పేల్చడం, వాటితో మనుషుల్లో ఆలోచనలు రేకెత్తించేలా చేయడం కొందరి వల్లే సాధ్యమవుతుంది. పూరి జగన్నాద్ మాటలు వదిలాడంటే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ లాక్ డౌన్లో పూరి జగన్నాద్ పాడ్ కాస్ట్ ద్వారా తన ఆలోచనలు, భావాలను అందరితో పంచుకున్నాడు. ఏదో ఒక టాపిక్ తీసుకుని తన అనుభవాలను జోడించి అద్భుతమైన సందేశాలు ఇస్తున్నాడు. తాజాగా వన్ మూమెంట్ అంటూ గొప్పగా మాట్లాడాడు.
బుద్దుడు చెప్పాడు..
ఏదో ఒక సందర్భం రోజును మారుస్తుంది. రోజులోని మార్పు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ మలుపు తిరిగిన జీవితం ప్రపంచాన్ని మార్చేస్తుందని బుద్ధుడు చెప్పారు. పుస్తకంలోని ఓ పేజీ, మీరు చదివిన ఓ కొటేషన్, విమానంలో మీ పక్కన కూర్చున్న వ్యక్తి, ఒక సినిమా లాంటివి ఏవైనా నీ జీవితాన్ని మార్చేయొచ్చు అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు..
తలుపు తట్టినా..
అవకాశం ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు. చాలా సార్లు అవి అవకాశాలే అన్న విషయం కూడా మనకు తెలియకపోవచ్చు. అందువల్ల ప్రతీ క్షణం జాగ్రత్తగా, రెడీగా ఉండాలి. కొంతమందికైతే లక్ష్మీదేవి వచ్చి రోజూ తలుపు తట్టినా వినిపించదు. గాఢ నిద్రలో ఉంటారని పూరి చెప్పుకొచ్చాడు.
ఆ మాటలు నమ్మకండి..
నాకో స్నేహితుడు ఉన్నాడు. అతడికి చాలా టాలెంట్ ఉంది. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవటం ఎలా అని అతడో పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని తన దగ్గరే పెట్టుకుని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాడు. అలాంటి వారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. నీకేంట్రా నువ్వింకా చిన్నపిల్లోడివి అని ఎవరైనా అంటే నమ్మకండని పూరి బలంగా చెప్పాడు.
Recommended Video
వాళ్లే నేర్పిస్తారు..
ఇక్కడ ఎవరికీ సమయం లేదు. కళ్లు మూసి తెరిచేలోపు వృద్ధాప్యం వచ్చేస్తుంది. మిమ్మల్నేవరూ ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించరు. ప్రారంభంలో అందరూ నిన్ను ఉపయోగించుకుంటారు. అలా చేస్తున్నారంటే నువ్వు పనికొస్తావని అర్థం. ఇలాంటి సమయంలోనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అన్నీ వాళ్లే నేర్పిస్తారు. నీ టైం బాగుంటే ఇలాంటి వారంతా ముందే ఎదురవుతారు. మరేం పర్లేదు వాళ్లే నిన్ను మార్చేస్తారని సందేశాన్ని పూరి ఇచ్చాడు.