twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యాట్సాఫ్ టు వైఎస్ జగన్.. పూరి జగన్నాద్ ప్రశంసల వర్షం

    |

    ప్రపంచమంతా కరోనా ధాటికి విలవిల్లాడుతోంది. మన దేశంలో కరోనా ప్రళయ తాండవం చేస్తోంది. రోజుకు వేలల్లో కరోనాకేసులు నమోదు అవుతున్నాయి. పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. అయితే ఇలాంటి విపత్కర కాలంలో ప్రజల సంక్షేమాని, ఆరోగ్యానికి, ప్రాణానికి పెద్దపీఠ వేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రారంభించిన ఓ అద్భుత కార్యక్రమంపై దేశమొత్తం తిరిగి చూస్తోంది.

    గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలందరికీ క్షణాల్లో వైద్య సదుపాయం అందించేందుకు నేడు 1088 అంబులెన్స్‌లో ఏకకాలంలో ప్రారంభించారు. వీటితో ఏ ఒక్కరూ కూడా అత్యవసర చికిత్స అందకుండా ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చు. వైఎస్ జగన్ కేర్స్ పేరిట ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అత్యవసర చికిత్సను అందించడానికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై సినీ ప్రముఖులు సైతం స్పందించారు.

    Puri jagannadh About YS Jagan Cares Programme

    డాక్టర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ కేర్స్ పేరిట ప్రారంభించిన ఈ కార్యక్రమంపై డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ స్పందించాడు. దేశ వ్యాప్తంగా అంతా కరోనా కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమన్నాడు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, విపత్తుల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడానికి '108,104' అంబులెన్స్‌ల సముదాయాన్ని ఏర్పాటు చేసిన జగన్‌కు హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశాడు.

    English summary
    Puri jagannadh About YS Jagan Cares Programme. he says that While the world is battling with corona crises , Hats off to ysjagan garu to arrange a fleet of ‘108,104’ ambulances in urban n rural areas of AP for emergencies, accidents , disasters and serious alignments . Huge respect sir
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X