twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిగిలిన జీవితం కూడా ఇలాగే నెమ్మదిగా గడిపేద్దాం.. పూరి ట్వీట్ వైరల్

    |

    పూరి జగన్నాద్.. పాటల రచయిత భాస్కర భట్ల సినీ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. పూరి ప్రతీ సినిమాలో భాస్కర భట్ల పాట వినిపిస్తుంటుంది. మెలోడి అయినా మాస్ సాంగ్ అయినా భాస్కర భట్ల శైలి విభిన్నంగా ఉంటుంది. భాస్కర భట్ల సాహిత్యం గురించి చెప్పాలంటే ఎన్నో ఉదాహరణలున్నాయి. మొదటి అవకాశం ఈవీవీ తీసిన గొప్పింటి అల్లుడు చిత్రంతో వచ్చింది. అక్కడి నుంచి సంగీత దర్శకుడు చక్రి తోడ్పాటుతో వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.

    ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో పాటల రచయితగా మంచి పేరు వచిచంది. ఆ సినిమాలోని మళ్లీ కూయవే గువ్వా అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలా భాస్కర భట్ల కలంలోంచి జారువాలిన పాటలెన్నో తెలుగు శ్రోతల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. కృష్ణ నగరే మామా (నేనింతే), నీవే నీవే (అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి), ఇప్పటికింకా నా వయసు (పోకిరి), సార్ ఒస్తారా (బిజినెస్ మేన్) ఇలా ఎన్నో మంచిపాటలను రచించారు.

     Puri Jagannadh Birthday Wishes To Bhaskarabhatla

    నేడు (june 5th) భాస్కరభట్ల పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు, ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. ఈ మేరకు దర్శకుడు పూరి జగన్నాద్ ట్వీట్ చేస్తూ.. 'మన ఇరవయి ఏళ్ల స్నేహం లో నాకోసం ఎన్నో పాటలు రాసావు తమ్ముడు . మిగిలిన జీవితం కూడా ఇలాగే నెమ్మదిగా గడిపేద్దాం . లవ్ యు .. హ్యాపీ బర్త్ డే' అని పేర్కొన్నాడు.

    English summary
    Puri Jagannadh Birthday Wishes To Bhaskarabhatla. Today (june 5th) Lyricists Bhaskarabhatla Ravi Kumar Birthday. Puri Jagannadh Wished him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X