twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ టైమ్‌లో అలీ వచ్చి పెగ్గు పోస్తాడు.. ఆయనిచ్చిన బొమ్మ వల్లే డబ్బు వచ్చింది: పూరీ ఎమోషనల్ స్పీచ్

    |

    చైల్డ్ ఆర్టిస్టుగా సినీ రంగానికి పరిచయమై.. తర్వాత కమెడియన్‌గా కొనసాగాడు ప్రముఖ నటుడు అలీ. మధ్య మధ్యలో ఎన్నో సినిమాల్లో హీరోగా కూడా కనిపించాడు. ఈయన కొన్ని వందల సినిమాల్లో నటించాడు. కొంచెం గ్యాప్ తీసుకున్న అనంతరం ఆయన హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే.. 'పండుగాడి ఫోటో స్టూడియో'. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ మంగళవారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పూరీ జగన్నాథ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే...

    అలీ కోసం ఎంతో దూరం వెళ్లేవాడిని

    అలీ కోసం ఎంతో దూరం వెళ్లేవాడిని

    ఆడియో వేడుకకు వచ్చిన పూరీ జగన్నాథ్ మనసు విప్పి మాట్లాడాడు. ‘నా చిన్నప్పుడు సీతాకోక చిలుక సినిమా చూశాను. ఆ తర్వాత తుని ఓ పార్టీకి వస్తున్నాడని తెలిసి పదేళ్ల వయసులో ఒక్కడినే యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లాను. అప్పుడు ఆయన అమితాబ్ బచ్చన్ పాటలకు డ్యాన్స్ వేసేశాడు. అలాంటి ఫ్యాన్ నేను' అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

    ఎన్నో హిట్లు వచ్చాయి

    ఎన్నో హిట్లు వచ్చాయి

    అలీతో కాంబినేషన్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘అలీకి ఫ్యాన్‌గా ఉన్న నేను.. ఆయనతోనే సినిమాలు చేశాను. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయన ట్రాక్స్ నా సినిమాల్లో మంచి పేరును సంపాదించాయి. ‘ఇస్మార్ట్ శంకర్'లో అలీని ఎందుకు తీసుకోలేని చాలా మంది అడుగుతున్నారు. తర్వాతి సినిమాలో చేయాలి' అని పూరీ అన్నాడు.

     పెగ్గు పోసి వెళ్లిపోతాడు

    పెగ్గు పోసి వెళ్లిపోతాడు

    అలాగే, అలీతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘నాకు ఫెయిల్యూర్ వచ్చి నేనెప్పుడైనా బాధల్లో ఉంటే అలీనే వస్తాడు. ఒక పెగ్గు పోస్తాడు. తర్వాత భుజం తట్టి వెళ్లిపోతాడు. అదే నాకు హిట్ వస్తే.. ఒక బొకే పట్టుకుని వస్తాడు. హగ్ చేసుకుని వెళ్లిపోతాడు. నాకు కష్టం వచ్చినా.. సుఖం వచ్చినా చెప్పకుండా వచ్చి కలిసే ఏకైక వ్యక్తి అలీనే' అని ఆయన చెప్పుకొచ్చాడు.

     బొమ్మ ఇచ్చాడు.. డబ్బు వచ్చేసింది

    బొమ్మ ఇచ్చాడు.. డబ్బు వచ్చేసింది

    తన జీవితంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా జీవితంలో ఏవో గ్యాంబ్లింగ్స్ జరిగి నా డబ్బంతా పోయింది. ఆ సమయంలో ఆఫీస్ తప్ప ఏమీ లేవు. అది కూడా అమ్మేశా. ఆరోజే ఖాళీ చేయాలి. అప్పుడు అలీ నా దగ్గరకు వచ్చాడు. జేబులో నుంచి పూజ చేసుకుని వచ్చిన బంగారపు లక్ష్మీదేవి బొమ్మను తీసి నాకిచ్చాడు. ఇది నీ దగ్గరే పెట్టుకో.. పోయినవన్నీ తిరిగొస్తాయని చెప్పాడు. అది రెండు మూడు లక్షలు ఉంటది. అలీ బ్లెస్సింగ్స్‌తో నా డబ్బంతా తిరిగొచ్చింది. లవ్ యూ భయ్యా' అని పూరీ వివరించాడు.

    ఆయన రియల్ హీరో

    ఆయన రియల్ హీరో

    అలీ గురించి చెబుతూ.. ‘52 సినిమాలు తీశాడని చెప్పారు. ఆ సినిమాల్లో హీరో కాదు.. అలీ రియల్ హీరో. అతను మనుషుల కోసం నిలబడతాడు ఎప్పుడూ. నా తర్వాతి సినిమాలో కలిసి చేద్దాం' అని పేర్కొన్నాడు.

    పండుగాడి ఫోటో స్టూడియో గురించి..

    పండుగాడి ఫోటో స్టూడియో గురించి..

    అలీ హీరోగా నటించిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో'. దీనికి ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది' అనేది క్యాప్షన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి రూపొందించారు.

    English summary
    Ali will be seen playing a photographer Pandu, who is under a snake curse of being a bachelor for forty years. When he meets his dream girl, his life would be different and things become unusual.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X