twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి చేసిన పాపం ఏంటి?... (ఫేస్‌బుక్ పోస్టు వైరల్)

    పూరి ఫేస్ బుక్ పోస్టు వైరల్ అయింది. ఇందులో పూరి గురించి చాలా విషయాలున్నాయి.

    By Bojja Kumar
    |

    దర్శకుడు పూరి జగన్నాథ్ తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. 'పూరి చేసిన పాపం ఏమిటి?' శీర్షికతో పబ్లిష్ అయిన ఈ పోస్టులో పూరి గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఈ ఫేస్ బుక్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయంది. అయితే ఇది పూరి తన గురించి తాను కాకుండా.... ఎవరో అభిమాని పూరి గురించి చెప్పినట్లు ఉండటం గమనార్హం.

    ఆ పోస్టులో ఉన్న వివరాలు ఉన్నది ఉన్నట్లుగా....

    పూరి చేసిన పాపం ఏంటి?

    రాజకీయ నాయకుడిలా అదిచేస్తాం ఇది ఇస్తాం...అని మభ్యపెట్టి గెలిచాక మాటమార్చాడా? మీ నోటికాడ కూడు లాగేసుకొని మీ ఉసురు పోసుకున్నాడా?లేదే. 17యేళ్ళ క్రింద ఇండస్ట్రీకి వచ్చాడు. గాడ్ ఫాదర్ లేకుండా ఇంతింతై వటుడింతై అన్న చందాన కష్టపడి తానెదుగుతూ తనతో వున్న వారిని ఎదగనిచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు.

    అతనికి తెలిసిందల్లా ఒకటే ప్రేక్షకుడు 100 రూపాయలు పెట్టి టికెట్ కొని, ఓ 3గంటలు తన విలువైన సమయాన్ని సినిమా చూడటం కోసం వెచ్చిస్తే...ఎలా ఆ ప్రేక్షకున్ని సినిమా చూస్తున్నంత సేపు తనే హీరో అయితే "అచ్చం ఇలాగే డైలాగులు చెప్తా, ఇలాగే విలన్లని ఇరగ్గొడుతా, హీరోయిన్స్ తోడాన్సులు చేస్తా, " అని తన కష్టాన్ని మరిచిపోయి లీనమయ్యేలా సినిమాలు తీయటం తెలుసు.

    సందేశాలు సమోసాలు చెబితే ఎవరు వింటారు?

    సందేశాలు సమోసాలు చెబితే ఎవరు వింటారు?

    పూరి స్ట్రైట్ ఫార్వడ్‌గా ఉంటాడు. అప్పటికీ ఇప్పటికీ అతనికి తెలియంది ఒకటే ఒకరికి భజన చేయటం, కొమ్ము కాయడం. బుల్లెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తాడు, సందేశాలు సమోసాలు అని సినిమా లో చెబితే ఎవ్వరూ వినరంటాడు. తను చేసే పనికి వందకి వంద శాతం న్యాయం చేశాడు. హిట్టు ఫట్టుతో సంభంధం లేదు. కాలంతో కలిసి ముందుకెళ్లాలనే రమణ మహర్షి సూక్తిని బాగా వంట పట్టించుకున్నాడు కాబట్టే మధ్యలో ఒకసారి నమ్మిన వాళ్లే మోసం చేస్తే ....మరేం పర్లేదు అన్నట్లుగా నష్టాల్ని, కష్టాల్ని ఎంతో ఇష్టంగా చిరునవ్వుతో స్వీకరించాడు.

    తనపై తనే సెటైర్ వేసుకున్న అమాయక చక్రవర్తి

    తనపై తనే సెటైర్ వేసుకున్న అమాయక చక్రవర్తి

    అందుకే కాబోలు పూరి తీసిన టెంపర్ సినిమా బిగినింగ్ లోనే "జీవితం ఎవ్వడ్నీ వదలదు అందరి సరదా తీర్చేస్తది" అన్న డైలాగ్ రాసి తనపై తనే సెటైర్ వేసుకున్న అమాయక చక్రవర్తి. బాణం బలంగా ముందుకు దూసుకెళ్లాలంటే వెనక్కే లాగాలి. సరిగ్గా అలాగే మండే సూర్యుడిలా పైకిలేచాడు...మళ్ళీ తెలివిగా సినిమాలు చేసి నిలబడ్డాడు. తనెంత మొండోడు అంటే ఒక్కసారి కమిటైతే తనమాట తనే వినడు. అందుకే ఎన్ని సమస్యలు రౌండప్ చేసి కన్ప్యూజ్ చేసినా తనేం చేయాలో తెలిసిన పిచ్చ క్లారిటీ వున్నోడు. అందుకే ఐలవ్ ఇండియా, ఐ హేట్ ఇండియన్స్ అంటూ మనకు పట్టిన బూజును దులపడానికి ఫిక్సైయ్యాడు.

    టెంప్ట్ అయ్యేంతలా ఎదిగాడు

    టెంప్ట్ అయ్యేంతలా ఎదిగాడు

    దర్శకుడంటే పూరిలా వుండాలి మనం కూడా వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయి దర్శకుడు అవ్వాలి అని పల్లెటూళ్లో వున్న కుర్రాళ్ళు సైతం కలలుగనే రేంజికి ఎదిగాడు. ప్రతి హీరో హీరోయిన్ ఆమాటకొస్తే ప్రతి ఆర్టిస్టు ఒక్కసారైనా పూరీ డైరెక్షన్ లో సినిమా చేయాలి అని టెంప్ట్ అయ్యేంతలా ఎదిగాడు.

    చరిత్రలో గొప్పోళ్ళకి తప్పలేదు అవమానాలు

    చరిత్రలో గొప్పోళ్ళకి తప్పలేదు అవమానాలు

    చరిత్రలో గొప్పోళ్ళకి తప్పలేదు అవమానాలు, నీలాపనిందలు. సరిగ్గా అదే ఇప్పుడు మన పూరీజగన్నాథ్ విషయంలో జరగబోతున్నట్లుంది! అయినా... ఏ రంగంలో లేవా బొక్కలు? ఇప్పుడు కోడై కూస్తున్న మీడియా వాళ్లేమైనా శ్రీరామచంద్రులా? పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదని అనే సామెతలా వుంది మీడియావాళ్ల యవ్వారం.

    కక్ష కట్టి మరీ రుద్దుతున్నారు

    కక్ష కట్టి మరీ రుద్దుతున్నారు

    కక్ష కట్టి మరీ రుద్దుతున్నారు. పూరీ అదనీ ఇదనీ చివరికి ప్రపంచాన్నే ఏదో చేయబోతున్నాడన్న ఒక భ్రమని అపోహని క్రియేట్ చేస్తున్నారు. జనాలు ఇదే నిజమని నమ్మేంతగా టీవీల్లో పొద్దు పొడిచింది మొదలు పొద్దుపోయేదకా పూరీ అండ్ కోని మర్డర్ చేసిన వాళ్ళుగా హైలెట్ చేసి చూపిస్తుండటంతో ఏ పాపం తెలియని వాళ్ల తల్లీతండ్రీ,భార్య పిల్లలు, అన్నాతమ్ముళ్లు అక్కాచెల్లెళ్లూ బంధుమిత్రులు ఎంతటి మనోవేదనని అనుభవిస్తున్నారో టీఆర్పీ రేటింగ్స్ కోసం కక్కుర్తి పడే మీడియా కి అది అనవసరం.

    సమాజంలో ఎన్ని సమస్యలు లేవు!

    సమాజంలో ఎన్ని సమస్యలు లేవు!

    సమాజంలో ఎన్ని సమస్యలు లేవు! రైతుల ఆత్మహత్యలు,నిరుద్యోగం, సంక్షేమ పథకాల్లో అవకతవకలు,మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కల్తీ అవుతూ మనిషి జీవితాల్ని సర్వనాశనం చేసే కుట్రలు, భూకబ్జాలు...ఇలా ఎన్నిలేవని! కానీ మీడియా నైతికవిలువలకి పాతరేసి మరీ అబద్దాల్ని నిజాలుగా నమ్మించాలని కంకణం కట్టుకొని శక్తివంచన లేకుండా ఈ డ్రగ్స్ గురించే ప్రచారం చేస్తుంది. ఇది న్యాయమా? పూరీకూడా మనలాగా సగటు మనిషే. తనకి బాధలుంటాయ్..సంతోషాలుంటాయ్. బాదల్ని తగ్గించు కోవాలని వాటి నుంచి బయట పడాలని ఎవరు మాత్రం కోరుకోరు.

    మనిషన్నాక కొన్ని బలహీనతలు కూడా

    మనిషన్నాక కొన్ని బలహీనతలు కూడా

    ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరు వాళ్లకు నచ్చినవి తీసుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. అయినా, భూమి మీదున్న ప్రతోడు మనిషే, దేవుడు కాదు. మనిషన్నాక కొన్ని బలహీనతలు కూడా వుంటాయి. ఇందులో ఆశ్ఛర్య పోవాల్సింది ఏంలేదు.

    దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది దాని నొప్పి

    దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది దాని నొప్పి

    దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది దాని నొప్పి. కొంతమందిని నమ్మినందుకు మోసం చేసి కింగ్ మేకర్ని అప్పులపాల్జేశారు. ఆ అప్పులు తీర్చడంకోసం కష్టపడి సంపాదించుకున్న కార్లూ, బంగ్లాలు అమ్ముకున్నోడికి ఇంకెంత నొప్పుండాలి. చీకటవ్వడమే ఆలస్యం, పబ్బుల్లో బార్లలో పీకలదాకా తాగి రోడ్ల మీద యాక్సిడెంట్స్ చేసే ఘనులు ఎంతమందో..చిన్న చిన్న ఓటమిలకే,మనస్పర్థలకే సూసైడ్ లు చేసుకునే పిరికివాళ్ళ కన్నా పూరీ చేశాడని చెబుతున్నది నీచమైందా? కాదు. కాబోదు.

    తనకి నష్టం చేసేదే కానీ పక్కోడికి ఇసుమంతైనా హాని కలిగించేది కాదు

    తనకి నష్టం చేసేదే కానీ పక్కోడికి ఇసుమంతైనా హాని కలిగించేది కాదు

    ఒకవేళ పూరీ మీడియాలో వస్తున్నట్లుగా డ్రగ్స్ తీసుకొని వుంటే అది తనకి నష్టం చేసేదే కానీ పక్కోడికి ఇసుమంతైనా హాని కలిగించేది కాదు. విధి రాతను తప్పించుకోవటం ఎవరివల్లా కాదు.కాబట్టి మీడియా సంయమనం పాటించాలి.రాబోయే కాలమే నిజాల్ని బయటపెడుతుంది.అప్పటిదాకా ఇంకొకరి మనసు గాయం చేయొద్దు.

    English summary
    Puri Jagannadh Facebook post drugs case goes viral after SIT investigation. Telugu filmmaker Puri Jagannadh was on Wednesday questioned for around 10 hours by the Telangana excise department’s SIT in connection with a probe into the illicit drug trade busted in the city, during which he provided “certain clues”, officials said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X