పూరి జగన్నాథ్‌ భార్యతో దురుసుగా...

By Srikanya

పాల్వంచ: ఏడాది క్రితం ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన ఆర్‌.షణ్ముఖాచారిని ఎస్పీకి అటాచ్‌ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ప్రాంతంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 11న స్థానిక బృందావన్‌ లాడ్జిలో ఎస్‌ఐ తనిఖీ చేశారు. ఆ సమయంలో.. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కుమారుడు హీరోగా నటిస్తున్నఆంధ్రా పోరి సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన భార్య లావణ్య అదే లాడ్జిలో బస చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తనిఖీల్లో భాగంగా లావణ్య, సినిమా హీరోయిన్‌, జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్న గదిలోనూ ఎస్‌ఐ సోదా చేశారు. వారిని గుర్తింపు కార్డులు చూపాల్సిందిగా అడిగి దురుసుగా మాట్లాడారని.. బాత్‌రూముల్లోనూ తనిఖీలు చేశారని తెలుస్తోంది. ఈ నెల 13న పాల్వంచకు వచ్చిన పూరి జగన్నాథ్‌కు ఆయన భార్య ఈ విషయాన్ని చెప్పడంతో.. ఆయన డీజీపీ, కొత్తగూడెం డీఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో డీఎస్పీ సురేందర్‌రావు బృందావన్‌ లాడ్జికి వచ్చి పూరి దంపతులతో మాట్లాడి వెళ్లారు. అనంతరం ఆదివారం షణ్ముఖాచారిని ఎస్పీకి ఎటాచ్‌ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. గతంలోనూ మహిళలతో పాటు పలువురిపట్ల షణ్ముఖాచారి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి.

 Puri Jagannadh Files A Complaint On Khammam SI

చిత్రం విషయానికి వస్తే..

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా జంటగా నటిస్తున్న ఆంధ్రాపోరి చిత్రం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రాజ్ మాదిరాజు దర్శకుడు.

దర్శకుడు మాట్లాడుతూ... ఋషి చిత్రం తరువాత రమేష్‌ప్రసాద్ మరోసారి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ విలువ ఏమిటో నాకు బాగా తెలుసు. కుటుంబ నేపథ్యంలో సాగే అందమైన టీనేజ్ ప్రేమకథాచిత్రమిదిఅన్నారు.

ప్రసాద్ ప్రొడక్షన్ ప్రయాణంలో ఈ రోజు చాలా ముఖ్యమైనది. మా సంస్థ నిర్మిస్తున్న 30వ సినిమా ఇది. మరాఠీలో మంచి విజయాన్ని సాధించిన టైమ్‌పాస్ చిత్రం ఆధారంగా ఆంధ్రాపోరి రూపొందిస్తున్నాం అని రమేష్ ప్రసాద్ తెలిపారు.

డా.శ్రీకాంత్, పూర్ణిమ, ఈశ్వర్‌రావ్, అరవింద్‌కృష్ణ,ఊర్మిళ కనిత్కర్, ఉత్తేజ్, అభినయ, శ్రీతేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:ప్రవీణ్ వనమాలి, సంగీతం:డా.జె, ఆర్ట్:రాజీవ్ నాయర్, డ్యాన్స్:చంద్రకిరణ్, సాహిత్యం:సుద్దాల అశోక్‌తేజ,రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X