జూ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ సినిమా డీటేల్స్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్-క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఖరారైంది. ఆగస్టు నెల నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరుపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
'బిజినెస్ మేన్' సినిమాతో పరిశ్రమలోకి కొత్తరకం సినిమా స్టైల్‌ను తీసుకొచ్చిన పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్‌తో చేసే సినిమా కూడా ప్రేక్షకులను ఆశ్చర్య పరిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఆంధ్రావాలా' లాంటి పరమ ప్లాపు సినిమా వచ్చింది. అయితే ఈ సారిమాత్రం అలాంటి అపజయం రీపీట్ కాదని అంతా నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వంలో 'దమ్ము' చిత్రం చేస్తున్నాడు. త్రిష, కార్తీక జూనియర్ తో రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత శ్రీను వైట్లతో 'యాక్షన్' అనే టైటిల్ తో మరో సినిమా చేయనున్నాడు. ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం రవితేజ హీరోగా 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











