విజయ్ దేవరకొండ కోసం కాకినాడకు వెళ్లి.. క్రేజ్ అంటే ఇదే, సరిగ్గా కుదిరితే!
Recommended Video

టాలీవుడ్ లో నయా స్టార్ గా ఎదుగుతున్న హీరో విజయ్ దేవకొండ. వరుస విజయాలు, ప్రత్యేకమైన నటనాశైలితో విజయ్ దేవరకొండ యువతలో క్రేజ్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ దర్శకులకు మోస్ట్ వాంటెడ్ హీరో. అర్జున్ రెడ్డి చిత్రంలో అదరగొట్టేసింది విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రంలో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైన టాక్సీవాలా చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ కోసం ఓ కథ రాస్తానని స్టార్ డెరెక్టర్ కొరటాల శివ స్వయంగా చెప్పారు. విజయ్ దర్శకుల జాబితాలో మరో స్టార్ డైరెక్టర్ కూడా చేరారు.

విజయ్ దేవరకొండ కోసం కాకినాడకు వెళ్లి
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ ఇటీవల కాకినాడకు వెళ్లి విజయ్ దేవరకొండని కలిశాడట. కథ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్స్ అంతా విజయ్ కోసం క్యూ కడుతున్నారంటే అతడి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.పూరి వివరించిన ఆసక్తికరమైన కథపై హీరో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ తండ్రితో
పూరి జగన్నాథ్ దర్శకుడు కాక ముందు దూరదర్శన్ ఛానెల్ లో సీరియల్స్ కు రచయితగా పనిచేశారు. పూరి రచయితగా పనిచేసిన పలు సీరియల్స్ లో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు నటించారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. చాలా రోజుల నుంచి విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని పూరి భావిస్తున్నాడట. కాకినాడలో డియర్ కామ్రేడ్ షూటింగ్ తో బిజీగా ఉన్న విజయ్ ని పూరి కథ వినిపించడానికి కలసినట్లు తెలుస్తోంది.

అంతకంటే ముందుగా
విజయ్ కంటే ముందుగా పూరి జగన్నాథ్ హీరో రామ్ తో ఓ చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి అంతా సిద్ధం అయిందని అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. హీరో రామ్ నటించిన చివరి చిత్రం హలో గురు ప్రేమ కోసమే పరవాలేదనిపించింది. కానీ 'నేను శైలజ' తరువాత ఆ స్థాయి హిట్ కోసం రామ్ ప్రయత్నిస్తున్నాడు.

సరైన కథ పడితే
ఇటీవల పూరి జగన్నాథ్ కు సరైన హిట్ లేదు అనేది వాస్తవం. దీనితో పూరి స్టామినాని తక్కువగా అంచనా వేయలేం. బద్రి, ఇడియట్, పోకిరి చిత్రాలకు ముందు కూడా ఎలాంటి అంచనాలు లేవు. కానీ పూరి తన మార్క్ తో బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించాడు. రామ్, విజయ్ దేవరకొండ చిత్రాలతో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూద్దాం.


Click it and Unblock the Notifications











