twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేరా భారత్ మహాన్.. ఎందరికో కళ్లు తెరిపించేలా.. ఘాటుగా పూరి జగన్నాథ్ కామెంట్లు

    |

    పూరి జగన్నాద్ డైలాగ్‌లు, ఆయన సినిమాలు నగ్న సత్యాలను చెబుతుంటాయి. ఓ జీవితంలో చూడాల్సిన, తెలుసుకోవాల్సినదంతా ఒకే ఒక మాటలో చెబుతాడు. నవతరం దర్శకుల్లో పూరి అంత ఘాటుగా, అంద పదునుగా రాసే రచయితలు చాలా తక్కువ. ముఖ్యంగా పూరి మార్క్ డైలాగ్స్ కోసమే సినిమాలకు వెళ్లే అభిమానులుంటారు. అలాంటి వారి కోసం పూరి తన భావాలను, ఆలోచనలు పాడ్ కాస్ట్ ద్వారా అందరికీ వినిపిస్తున్నారు.

     పూరి ఆడియో..

    పూరి ఆడియో..

    పూరి జగన్నాద్ పాడ్ కాస్ట్ ద్వారా.. తన ఆలోచనలు అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో పూరి చెప్పిన ఎన్నో ఎంతో మందిని ఆకర్షించాయి. స్త్రీల గురించి, యువత గురించి, దేశం గురించి ఇలా నిత్యం ఏదో టాపిక్ మీద పూరి ఆడియోలను విడుదల చేస్తున్నాడు. నేటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన దేశం, ప్రజల గురించి కొన్ని కటువైన నిజాలను చెప్పుకొచ్చాడు.

     నిజాలు మాట్లాడుకుందాం..

    నిజాలు మాట్లాడుకుందాం..

    ‘కాసేపు మన గురించి, మన దేశం గురించి నిజాలు మాట్లాడుకుందాం.. మనది కర్మభూమి అంటాం.. కామన్ సెన్స్ ఉండదు.. వేద భూమి కానీ వేదాలు ఎక్కడుంటాయో కూడా తెలీదు.. పుణ్యభూమి కానీ లెక్కలేనన్ని పాపాలు చేస్తాం.. మన తల్లి భారతమాత.. కానీ గంటకో రేపు చేస్తుంటాం.

     కొట్టుకుని చస్తాం..

    కొట్టుకుని చస్తాం..

    మనది సువిశాల భారతఖండం అంటాం కానీ పాపులేషన్‌తో కిటకిటలాడి చస్తాం.. గంగా యమునా గోదావరి ఉన్నాయి కానీ ఆ నీళ్ల కోసం కొట్టుకుని చస్తాం.. ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయ్.. ఆ గుళ్ల బయటే చెప్పులు దొంగిలిస్తుంటాం.. మహా కవులు పుట్టిన దేశం మనది కానీ 65శాతం నిరక్షరాస్యత..

    అన్నీ అలాంటి పనులే..

    అన్నీ అలాంటి పనులే..

    మనది ఆర్య సంస్కృతి అందుకే పెట్రోల్ కిరోసిన్ కలిపేస్తాం.. పాలల్లో నీళ్లు కలిపేస్తాం.. మునిసిపాల్టీ నీళ్లను కూడా కలుషితం చేస్తాం.. రేషన్ బయట అమ్మేస్తాం.. ఓట్లు అమ్ముకుంటాం.. టికెట్ లేకుండా ప్రయణాలు చేస్తాం.. పక్క భూములను కబ్జా చేస్తాం.

    ఫ్రీడం వల్ల అదే నేర్చుకున్నాం..

    ఫ్రీడం వల్ల అదే నేర్చుకున్నాం..

    ఈ ఫ్రీడం వల్ల మనం కొన్ని నేర్చుకున్నాం.. పెంటతీసి నెత్తికి రాసుకోవడం.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం.. పుల్లపెట్టి పక్కోన్ని గెలకడం.. వంటివి మాత్రం బాగా నేర్చుకున్నాం. పైన చెప్పిన వెదవ పనులెన్నో మనం చేశాం. అయితే ఇప్పటి నుంచి ఓ పేపర్ తీసుకోండి.. ఇప్పటి వరకు చేసిన వెదవ పనులన్నీ రాసుకోండి.. ఎవ్వరికీ చూపించకండి... భవిష్యత్తులో చేయకుండా చూసుకోండి.

    Recommended Video

    Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
     కనీసం అది చేసినా..

    కనీసం అది చేసినా..

    200ఏళ్లు బానిసత్వంలో బతికి పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం ఇది. మనం మారకపోతే.. ఎవ్వరూ మార్చలేరు.. ఏ రాజకీయ నాయకుడు మనల్ని మార్చలేరు. కనీసం ఆ గోడ మీద ఉచ్చ పోయకపోయినా సరే అది కూడా దేశభక్తే.. జనగణమన' అంటూ పూరి తన భావాలను పంచుకున్నాడు. పదునైనా మాటలతో కొందరిలోనైనా ఆలోచనలను రేకెత్తించాడు. ఇక ఈ మాటలను విన్న యంగ్ హీరో కార్తికేయ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Puri jagannadh On Podcast About Independence Day. 3minutes27seconds. This should be played in all the tv channels, radio stations,every social media platform. MERA BHARAT MAHAAN by
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X