»   » పూరి బర్త్ డే పార్టీ: బెల్లీ డాన్స్ ఎంజాయ్ చేసిన వర్మ (వీడియో)

పూరి బర్త్ డే పార్టీ: బెల్లీ డాన్స్ ఎంజాయ్ చేసిన వర్మ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ నిన్న తన 49వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పూరి సినిమా ఇండస్ట్రీలోని తన క్లోజ్ ఫ్రెండ్స్ కోసం లావిష్ పార్టీ ఇచ్చినట్లు సమాచారం. సినీ స్టార్ అంటే ఫారిన్ సరుకుతో పాటు డెలీసియస్ వంటకాలు ఉండటం మామూలే. పూరి బర్త్ డే పార్టీలో అందమైన భామలతో బెల్లీ డాన్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ బర్త్ డే పార్టీకి సంబంధించి వీడియో క్లిప్ పేరుతో ఓ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఇద్దరూ డాన్సర్లు బెల్లీ డాన్స్ చేస్తుండగా... వారి పక్కనే సిగరెట్ పీలుస్లూ, డ్రింక్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో పలు టీవీ ఛానల్స్ కూడా ప్రసారం చేసాయి.

 Puri Jagannadh, Ram Gopal Varma Enjoying Belly Dances At Puri Birthday Party

అయితే ఈ వీడియో మీడియాలో ప్రసారం కావడం వివాదాస్పదం అయింది. ప్రైవేట్ పార్టీని పబ్లిక్ చేయడం చేయడం ఏమిటనే విమర్శలు సైతం వచ్చాయి. దీంతో ఈ వీడియో ప్రసారం చేసిన టీవీ ఛానల్స్ ఇరకాటంలో పడ్డాయి. వెంటనే తమ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈ వీడియో తొలగించినట్లు సమాచారం. అయితే ఇంటర్నెట్లో మాత్రం ఈ వీడియో ప్రసారం అవుతూనే ఉంది.

Video Courtesy: youtube.com

English summary
It is known that Puri Jagannadh has arranged a lavish birthday party on the eve of his 49th birthday to his close friends from the industry. Puri usually jell along with his own set of friends and he chose to celebrate his birthday also only with them.
Please Wait while comments are loading...