Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిజమే ..కానీ అంటూ పూరి జగన్నాథ్ క్లారిఫికేషన్
హైదరాబాద్ : "అవును, ఆకాష్ ప్రధానపాత్రగా సినిమా చేస్తున్నది నిజమే. కానీ వాడి లాంచింగ్ సినిమా అని చెప్పలేం. వాడికి ఇంకా 17 సంవత్సరాలే. మరో నాలుగేళ్లలో ఫుల్ ఫ్లెడ్జెడ్ హీరోగా లాంచ్ అవుతాడు ." అంటూ పూరి జగన్నాథ్ తన కుమారుడు లాంచింగ్ గురించి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన కుమారుడు హీరోగా లాంచ్ అవుతున్నాడంటూ వచ్చిన వార్తలపై పై విధంగా ఆయన స్పందించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే...
పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ హీరోగా లాంచ్ కానున్నాడు. అయితే ఓ రీమేక్ తో అతన్ని లాంచ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రసాద్ ప్రొడక్షన్స్ పై రమేష్ ప్రసాద్ నిర్మించే చిత్రంతో ఆకాష్ లాంచ్ అవనున్నాడని తెలుస్తోంది.
‘టైం పాస్' అనే మరాఠి చిత్రం రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. గతంలో ‘ఋషి', ‘అంకుల్'సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజ్ మాదిరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. . ఈ చిత్రానికి చెందిన పూర్తి వివరాలు త్వరలోనే అఫీషియల్ గా తెలియజేసే అవకాశం ఉంది.
ఇక పూరి కొడుకు ఇప్పటి వరకూ ‘గబ్బర్ సింగ్', ‘బుజ్జిగాడు', ‘ధోని' మొదలైన సినిమాలలో బాల నటుడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో నటించటానికి పూరి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆకాష్ ఈ చిత్రంతో హిట్ కొడితే నెక్ట్స్ తన తండ్రి డైరక్షన్ లో నే సినిమా చేయవచ్చు.