For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాట్సప్ లో ఐశ్వర్యకు అసభ్య సెల్ఫీ ..ఇరుకున్న ఆర్టిస్ట్, కేసు, అసలేం జరిగింది?

By Srikanya
|

ముంబై: సినిమాల్లో విలన్ వేషాలు వేసేవాళ్ళు నిజ జీవితంలో అలా ఉండాలని లేదు, అలాగే తెరపై హీరోగా ,దేముడిగా కనిపించేవాళ్ళు నిజ జీవితంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వివాదాలు ఫేస్ చేసారు. అయితే తెరపై విలన్ గా కనిపించే ...వ్యక్తి నిజ జీవితంలోనూ అదే పాత్రను కొనసాగిస్తాడని ఊహించలేం.

తెలుగులో ఎక్కువగా పూరి జగన్నాథ్ సినిమాల్లో విలన్ గా చేసిన నటుడు ఎజాజ్‌ ఖాన్‌( మహేష్ ...దూకుడు ఫేం)ను ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసభ్యకర ఫొటోలు పంపుతున్నాడంటూ ఐశ్వర్య అనే పేరు గల ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.

ఓ మహిళ విషయంలో ఇలా బిహేవ్ చేయటంతో అంతా సీరియస్ గా తీసుకున్నారు. ఈ సంఘటన ఖచ్చితంగా అతని కెరీర్ పైనా పడుతుందని అంటున్నారు. సెలబ్రెటీ హోదాలో ఉండి, అలాంటి చీప్ పనులు చేయటం ఏంటని తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగింది. ఆ మహిళ ఫిర్యాదులో ఏమని కంప్లైంట్ చేసిందో చూద్దాం.

రోజూ ఛాటింగ్

రోజూ ఛాటింగ్

నెల రోజుల క్రితం ఎజాజ్‌ నుంచి మల్వానీకి చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. ఆ తర్వాత రోజూ చాటింగ్‌ చేసుకున్నారు. మహిళ బొటీక్‌ నిర్వహిస్తుంటుంది. ఫేస్ బుక్ ద్వారా ఇద్దరి మధ్యా మంచి స్నేహం కలిసింది.

షూటింగ్ లో ఉండి కలవలేక

షూటింగ్ లో ఉండి కలవలేక

కొంతకాలం తర్వాత ఆమెకు డబ్బు అవసరం వచ్చి ఎజాజ్‌ను సాయం చేయమని అడిగింది. అతను సరేనని చెప్పి వచ్చి కలవమన్నాడు. మహిళ ఎజాజ్‌ని కలవడానికి వెళ్లినప్పుడు అతను షూటింగ్‌లో ఉన్నాడు. దాంతో వాళ్లు కలుసుకోలేకపోయారు.

వాట్సప్ లో టచ్ లో

వాట్సప్ లో టచ్ లో

తర్వాత అతడే మరో రెండు మూడు సార్లు ఫోన్‌ చేసి కలుద్దామని చెప్పగా ఆమె అంగీకరించలేదు. అయితే ఆ తర్వాత అదే స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ... ఇద్దరూ వాట్సాప్‌ ద్వారా టచ్‌లో ఉన్నారు.

అసభ్యంగా ఉన్న...

అసభ్యంగా ఉన్న...

ఈ మధ్య ఎజాజ్‌ వాట్సాప్‌లో పెట్టిన ప్రొఫైల్‌ పిక్చర్‌ బాగుందని మహిళ అతనికి మెసేజ్‌ పెట్టింది. ఆ తర్వాత ఎజాజ్‌ ఆమెకి అసభ్యకరంగా ఉన్న తన సెల్ఫీని మెసేజ్‌ చేశాడు. దాంతో ఆమె షాక్ అయ్యింది.

పోలీసులకు కంప్లైంట్

పోలీసులకు కంప్లైంట్

ఇలాంటి ఫొటో ఎందుకు పంపావు అని మహిళ అడిగితే.. నచ్చకపోతే క్షమించు అని మెసేజ్‌ పెట్టాడు. ఈ ఘటన తర్వాత చాలా సార్లు ఆమెకు మరిన్ని ఫొటోలు అసభ్యకరమైనవి పంపటంతో... ఆ మహిళ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎవరికీ పంపలేదంటున్నాడు

ఎవరికీ పంపలేదంటున్నాడు

అయితే ఎజాజ్‌ మాత్రం తానెవరికీ మెసేజ్‌లు, ఫొటోలు పంపలేదని, సెలబ్రిటీ కావడంతో తనను లక్ష్యం చేసుకుని వేధించాలని చూస్తున్నారని మీడియాకి వెల్లడించాడు. కొన్ని హిందీ, తెలుగు చిత్రాల్లో నటించిన ఎజాజ్‌ బిగ్‌బాస్‌ రియాలిటీ షో 7లో పాల్గొన్నాడు.

సల్మాన్ కు కూడా

సల్మాన్ కు కూడా

ఇది హెరాస్మెంట్. గతంలోనూ ఆమె సల్మాన్ ఖాన్ పై ఇలాంటి కేసే పెట్టింది. సల్మాన్ భాయ్ కావటంతో అది అక్కడితో సెటిలైపోయింది. నేను చిన్న వాడ్ని కావటంతో మీడియా మొత్తం ఎటెన్షన్ పెట్టింది. పోలీసులు అసలు విషయాలు విచారించలేదు అన్నారు ఈ ఆర్టిస్ట్.

ఇదీ ఆమె వెర్షన్

ఇదీ ఆమె వెర్షన్

నాకు తెలుసు..అజీజ్ పెద్ద స్టార్ కాదని, నేను ముంబై కు వచ్చినప్పుడు నాకు ఓ స్నేహితుడు అజీజ్ మంచి వ్యక్తి అని, అతనితో టచ్ లో ఉండమని, అతను ఏదైనా పని ఇప్పిస్తాడనే అవకాసం ఉందని అన్నారు. అందుకే టచ్ లో కి ఉన్నాను అని చెప్పుకొచ్చింది.

నిజంగా నేను తప్పు చేస్తే...

నిజంగా నేను తప్పు చేస్తే...

నిజంగా నేను తప్పు చేసి ఉండి, ప్రూవైతే నాకు అసలు కోర్టు నుంచి బెయిల్ దొరికేది కాదు. నేను నా ఫోన్ ని సాక్ష్యంగా ఇచ్చే బయిటకు వచ్చాను. అయితే ఆమె మాత్రం నేను పంపానని చెప్పున్న ఫొటో ఉన్న సెల్ ఇవ్వలేదు. అయితే నా ఫొటోని మార్ఫ్ చేసి ఉపయోగించిందని తెలుస్తోంది. ఇప్పటికే నా లాయిర్ ఈ విషయమై సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. నేను అమాయికుడుని చూపెట్టుకునే సాక్ష్యాలు ఉన్నాయి అన్నాడు అజీజ్

అదే ఆమె దుర్మార్గమైన ఆలోచన

అదే ఆమె దుర్మార్గమైన ఆలోచన

అయితే నేను ఆమెతో ఫోన్ లో టచ్ లో ఉన్నది నిజం. ఆమెతో ఫ్రెండ్లీగా నేను ఛాట్ చేసాను. ఆ ఛాట్ ని ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఆమె చెప్పేదంతా అబద్దం. మగవాళ్లపై సెక్సవల్ వేధింపులు కేసు పెట్టి డబ్బులు లాగాలన్నదే ఆమె ఆలోచన. చట్టాన్ని ఆమె దుర్వినియోగం చేస్తోంది. ఒకసారి ఓ అమ్మాయి...మగవాడిపై కంప్లైంట్ చేస్తే...తన అమాయకత్వాన్ని నిరూపించుకోల్సిందే వేరే దారి లేదు అన్నారు.

నిజాలు తెలుసుకోకుండా

నిజాలు తెలుసుకోకుండా

ఇక ఈ విషయమై అజీజ్ చాలా బాధగా ఉన్నారు. మీడియా నిజానిజాలు పట్టించుకోకుండా వ్యాఖ్యానాలు చేస్తోందని అన్నారు. మీడియా నన్ను పిలిచి అడిగి ఉంటే నిజాలు బయిటకు వచ్చేవి. ఆమె వైపు వెర్షన్ ని మాత్రమే ప్రచారంలోకి తెచ్చారు. నేను అరెస్ట్ అవటమే వారికి బ్రేకింగ్ న్యూస్. అయితే నేను అరెస్ట్ అవ్వలేదు. ఎక్కడికి పారిపోలేదు అన్నారు.

కేసు వేస్తాను

కేసు వేస్తాను

అలాగే ఇంతలా నా పరువు తీసే ప్రయత్నం చేసిన ఆమెపై ఖచ్చితంగా కేసు వేస్తాను. అయితే ఈ విషయంతో ఆమె కీర్తి సంపాదిద్దామనుకుంటే మాత్రం జరగని పని, నా వైపు న్యాయం ఉంది. నన్ను నేను నిజాలతో బయిటపడేసుకుంటాను అన్నారు అజీజ్

English summary
Ajaz Khan is not new to Telugu Film Industry as we have seen him several times in Puri Jagannadh’s latest movies as a baddie. A lady registered a complaint on the actor for allegedly sending her obscene pics. The actor had taken nude selfies of his private parts and sent it to the woman.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more