పూరి బర్త్ డే కాయ్ రాజా కాయ్ (ఫోటోస్)
హైదరాబాద్: ఫుల్ మూన్ ఎంటర్ టైన్ మెంట్స్, మారుతి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కాయ్ రాజా కాయ్'. శివ గణేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ ఖన్నా, మానస్, జోష్ రవి, శ్రావ్య, షామిలి నటీనటులు. భాస్కర్, సతీష్ రాజు నిర్మాతలు. జె.బి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం తాజ్ దక్కన్ హోటల్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి పూరి జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే రోజు పూరి జగన్నాథ్ పుట్టినరోజు కావడంతో ఇదే వేదికపై ఆయనతో కేక్ కట్ చేయించి బర్త్ డే వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, మారుతి, సంపూర్ణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో...

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...
'భాస్కర్, సతీష్ నాకు మంచి స్నేహితులు. ఫుల్ మూన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థను ఆరంభించి, తొలి ప్రయత్నంగా వారు చేస్తున్న 'కాయ్ రాజా కాయ్' సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

మారుతి మాట్లాడుతూ
పూరి జగన్నాధ్ గారి 'ఇడియట్' చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మా ఆడియో వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో, బస్టాప్ చిత్రాలకు నా దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసిన శివగణేష్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ముగ్గురు కుర్రాళ్ల మధ్య సాగే కథ ఇది. రామ్ ఖన్నా, మానస్, రవి తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. జె.బి మంచి పాటలందించారు. సినిమా హిట్టవుతుందనే నమ్మకం ఉందన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...
దర్శకుడు శివగణేష్ మాట్లాడుతూ కాయ్ రాజా కాయ్ ఆట ఆడిన యువకుల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ఈ చిత్రం కథాంశం. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. దేవ్ ఫోటోగ్రఫీ, జె.బి పాటలు సినిమాకి ప్లస్ అవుతాయనిని తెలిపారు.

పూరి పుట్టినరోజు వేడుక
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు వేడుక ‘కాయ్ రాజా కాయ్' టీం ఆధ్వర్యంలో నిర్వహించారు.


Click it and Unblock the Notifications











