లక్కీ ఛాన్స్ : పూరి దర్శకత్వంలో నటించాలనుందా?

By Srikanya

హైదరాబాద్ : మీరు హీరో కావచ్చు.హీరోయిన్, బ్యాడ్ గై , క్యారక్టర్ ఆర్టిస్టు ఏదైనా కావచ్చు...పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించవచ్చు...వయస్సు నిమిత్తం లేదు. మీకు నటించాలని ఉంటే ఈ వెబ్ సైట్ కు వెళ్లండి...అక్కడనుంచి మీరు రిజిస్టర్ చేసుకుని రెస్యూమ్ పంపంవచ్చు.

ఆ వెబ్ సైట్ ఇదిగో...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Puri Jagannadh’s hunt for new Actors

ప్రస్తుతం పూరి చేస్తున్న సినిమా విషయానికి వస్తే...

ఎన్టీఆర్‌, పూరిజగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుత్ను చిత్రం ‘టెంపర్‌'. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ సైతం మంచి క్రేజ్ సంపాదించునకుంది.

ఈ టీజర్‌కు యుట్యూబ్‌లో మంచి ఆదరణతో పాటు ఒక్కరోజులోనే ఐదు లక్షలకుపైగా క్లిక్స్‌ వచ్చాయంటే అభిమానులు ఏ రేంజ్‌లో ఈ సినిమాను ఆశిస్తున్నారో అర్ధమౌతుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తుండగా..ఫిబ్రవరి మొదటివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

Puri Jagannadh’s hunt for new Actors

ఈ చిత్రంపై పూరిజగన్‌ మార్క్‌ కనిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పూరి మార్క్‌కి ఎన్టీఆర్‌ డైలాగులు తోడయితే ఎలా ఉంటుందో చూపించేదే ఈచిత్రం. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ముద్దుగుమ్మ కాజల్‌ నటిస్తుంది. బండ్ల గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరిజగన్నాథ్‌, ఎన్టీఆర్‌ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

మరో ప్రక్క ఓ ప్రముఖ చానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. 7.7 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆ చానల్ దక్కించుకుందట. ఇది భారీ ఆఫర్. ఎన్టీఆర్ గత చిత్రాలతో పోల్చితే 'టెంపర్' భారీ శాటిలైట్ ఆఫర్ ని దక్కించుకుంది. సినిమాపై నెలకొన్న అంచనాలే ఈ రేంజ్ శాటిలైట్ ఆఫర్ రావడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X