సెక్స్ వర్కర్ పెళ్లిచేసుకుంటే.... (‘జ్యోతి లక్ష్మి’ ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్: ఛార్మికి తొలి నాటి నుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ వస్తూనే ఉన్నాయి. అనుకోకండా ఓ రోజు నుంచి మంత్ర దాకా హిట్స్ కొట్టిన ఆమె తర్వాత ఫ్లాపుల వర్షంలో మునిగిపోయింది. హిట్ అనేది లేని దశలో బాలీవుడ్ కు ప్రయాణం కట్టింది. కానీ అక్కడా నిలదొక్కుకోలేకపోయింది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా తానే నిర్మాతగా మారి ...ఈ చిత్రాన్ని పూరి దర్శకత్వంలో చేసింది. ఓ సెక్స్ వర్కర్ పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలను చర్చిస్తూ సాగే ఈ చిత్రంపై ఆమె పూర్తి నమ్మకం పెట్టుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మల్లాది వెంకటకృష్ణమూర్తిగారి ‘మిసెస్‌ పరాంకుశం' నవల ఆధారంగా పూరి జగన్నాథ్‌ ఈ సినిమా తీశారు. మౌలికంగా ఇది అసాధారణమైన ప్రేమకథ. జ్యోతిలక్ష్మి ఓ సెక్స్‌వర్కర్‌. ఆమెతో హీరో ప్రేమలో పడతాడు. ఈ సినిమా కథ వాళ్లిద్దరి రొమాన్స్‌తోనే మొదలవుతుంది. అతను జ్యోతిలక్ష్మిని పెళ్లాడతాడు. ఆమె సెక్స్‌వర్కర్‌ కాబట్టి వెంటనే గృహిణిలా మారిపోలేదు. కానీ భర్త ప్రేమ ఆమెను మారుస్తుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఏదైనా సమస్య తలెత్తితే ఒక స్త్రీ ఎలా పోరాడుతుంది? అసలా సమస్య ఏంటి? అనేదే ఈ సినిమా.

దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.... 'జ్యోతిలక్ష్మి' నాకు ఇష్టమైన కథ. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ద నవల 'మిసెస్‌' పరాంకుశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాను. ఆరు సంవత్సరాలుగా ఛార్మి ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాను. సినిమాలో ఛార్మి అద్భుతంగా నటించింది. కళ్యాన్‌గారితో మొదటిసారిగా ఈ సినిమాకి వర్క్‌ చేసాను. ఆయనతో మరో సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నాను. సునీల్‌కశ్యప్‌గారి సంగీతం, భాస్కర్‌భట్లగారు రాసిన పాటలు ఫెంటాస్టిక్‌గా వచ్చాయి. విందా చాలా తక్కువ సమయంలో మంచి ఫొటోగ్రఫి ఇచ్చాడు. హీరో సత్యకు మొదటి సినిమా అయినా బాగా నటించాడు అన్నారు.

జ్యోతి లక్ష్మి సినిమా అనగానే ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించి అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి ‘జ్యోతి లక్ష్మి' కాన్సెప్టు ఇది కాదని స్పష్టమవుతోంది. యాక్షన్ కూడా ఈ టీజర్ లో మిక్స్ చేసి వదిలి సినిమాపై ఆసక్తి రేపారు.

 Puri Jagannadh's Jyothi Lakshmi preview

ఛార్మి మాట్లాడుతూ... ‘నేనేమిటనేది ‘జ్యోతిలక్ష్మి' నిర్ణయిస్తుంది. ఇటీవలి కాలంలో నాకు బాగా సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. ఈ సినిమాని నా భుజాల మీద కాకుండా, నా హృదయంలో మోసుకు తిరుగుతున్నాను'' అన్నారు.

అలాగే... సెకండాఫ్‌లో పెళ్లయ్యాక జ్యోతిలక్ష్మి రూపంలోనే కాక నా పర్ఫార్మెన్స్‌లోనూ మార్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి భార్య లేదా ఇలాంటి కూతురు ఉంటే బాగుంటుంది అనే గౌరవం వచ్చే సినిమా. ‘జ్యోతిలక్ష్మి' సెక్స్‌వర్కర్‌ అయినా ఆమెపై ఎందుకు రెస్పెక్ట్‌ వస్తుందంటే ఆమె హీరోతో తప్ప ఇంకెవరితో కనిపించదు.

సెకండాఫ్‌లో ఆమె ఓ సమస్యపై పోరాడినప్పుడు ప్రేక్షకులకి ఆమెపై గౌరవం ఏర్పడుతుంది. నేనైతే సినిమా చూశాక ఏడ్చేశాను. ఇన్నేళ్ల నుంచీ జనం తమ పిల్లలకు ‘జ్యోతిలక్ష్మి' అనే పేరు పెట్టడం మానేశారు. కానీ ఈ సినిమా చూశాక ఆ పేరుపెట్టడం మొదలుపెడతారు.ఈ పాత్ర కోసం జగన్‌గారి సలహామేరకు 11 కిలోల బరువు తగ్గాను అంటూ చెప్పుకొచ్చారు.

పేరు క్యాచీగా ఉండాల‌ని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుంద‌ని అది ఓకే చేశామ‌ని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిల‌క్ష్మి నిజ జీవితానికి సంబంధం లేద‌ని పేర్కొన్నారు.

బ్యానర్: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌
నటీనటులు: ఛార్మి కౌర్‌, సత్య, వంశీ, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు తదితరులు
సినిమాటోగ్రఫీ: పి.జి.వింద,
కథ: మల్లాది వెంకట కృష్ణ మూర్తి
సంగీతం: సునీల్‌ కశ్యప్‌,
నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
సమర్పణ: ఛార్మి కౌర్
విడుదల తేదీ: 12, జూన్ 2015.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X