స్టోరీ తనదే: కొత్త డైరెక్టర్ల కోసం పూరి వేట...
హైదరాబాద్: కొత్త డైరెక్టర్ల కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ టాలెంట్ హంట్ ప్రారంభించారు. పది రోజులు, పది స్టోరీలు, పది నిమాషాలు అంటూ ఆయన ఆఫర్ ప్రకటించారు. గత పదిహేనేళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. ఈ జనరేషన్ వాళ్లు నాకంటే తెలివైన వాళ్లు. పరిశ్రమకు కొత్తవారు రావాలి అని ఆయన కోరుకుంటున్నారు.
ఓ ప్రముఖ మీడియా సంస్థ సాక్షితో సంయుక్తంగా ఆయన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విషయమై మాట్లాడుతూ పది రోజుల పాటు రోజుకో స్టోరీ చొప్పున పది స్టోరీలు ఇస్తానని, దాన్ని 10 నిమిషాల సినిమాగా తీసి చూపించాలని...సినిమా ఏ డిజిటల్ కెమోరాతో అయినా తీయొచ్చని, అవేవీ లేక పోతే ఐఫోన్ తీసినా ఓకే. అయితే తాను ఇచ్చిన స్టోరీ అద్భుతంగా తీసిన వారికి అవకాశాలు ఇస్తానని అంటున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తానని చెప్పాడు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘టెంపర్' చిత్రానికి దర్శకత్వం వహింస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇన్సపెక్టర్ దయ గా కనిపించనున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా రగ్గడ్ గా ఉండబోతోందని, చాలా సార్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పాత్ర ఇదని చెప్తున్నారు. సర్కిల్ ఇన్సపెక్టర్ గా ఎన్టీఆర్ చెలరేగిపోతున్నాడని వినికిడి. నాగార్జున శివ మణి లో చేసిన పాత్ర తరహాలో పూర్తి మాస్ టచ్ లో ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.
శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











