»   » కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా పూరి దర్శకత్వంలో...

కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా పూరి దర్శకత్వంలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో సుడి తిరగడానికి ఒక్క హిట్టు చాలు. తాజాగా ‘పటాస్' సినిమా విజయం సాధించడం అటు దర్శకుడు అనిల్ రావిపూడికి, ఇటు హీరో కళ్యాణ్ రామ్‌కి బాగా కలిసొస్తోంది. తాజాగా అందుతున్న హాట్ న్యూస్ ఏమిటంటే కళ్యాణ్ రామ్ తర్వాతి సినిమా పూరి జగన్నాథ్‌తో ఖరారైంది. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘టెంపర్' షూటింగులో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అతను కళ్యాణ్ రామ్‌తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసుకోనున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Puri Jagannadh to Direct Kalyan Ram!

పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘టెంపర్' మూవీ విశేషాల్లోకి వెళితే.....ఈ చిత్రం ఆడియో వేడుక జనవరి 28న ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆడియో సీడీ మాత్రం ఇప్పటికే ఆవిష్కరించేసారు. సోమవారం రథ సప్తమి కావడంతో ఈ పని చేసారు. దీని గురించి నిర్మాత బండ్ల గణేష్ వెల్లడిస్తూ...‘రథసప్తమి. చాలా మంచి రోజు. అందుకే టెంపుల్ లో ఆడియో సీడీ రిలీజ్ చేసాం. ఆడియో రిలీజ్ వేడుక మాత్రం ఈ నెల 28న జరుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి' అంటూ ట్వీట్ చేసారు.

ఈ చిత్రం ఆడియో ఈనెల 28న విడుదల చేయడానికి నిర్మాత బండ్ల గణేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియోకి నందమూరి బాలకృష్ణ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్‌ సమాచారం. దీంతో నందమూరి అభిమానుల్లో సందడి వాతావరణం ఏర్పడుతుంది. అయితే బాబాయ్‌-అబ్బాయ్‌ని ఒకే వేదికపై చూడాలనేకునే అభిమానులు ఆరోజు కోసం వేచి చూస్తున్నారు.

ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 12 లేదా 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

English summary
Hero Nandamuri Kalyan Ram has confirmed that his next movie is with director Puri Jagannath which is going to start shortly after the release of Temper movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu