twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌తో పావు సెంచరీ కొట్టిన పూరి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ స్పీడు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హిట్లు ప్లాపుల సంగతి పక్కన పెడితే...చకా చకా సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేయడం పూరి స్టైల్. బిజినెస్ మేన్ చిత్రాన్ని 4 నెలల్లో పూర్తి చేసి 5 నెలలో విడుదల చేసి భారీ విజయం సాధించాడు. ఇక ఈ సంవత్సరం పూరి చేసిన మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే బిజినెస్ మేన్, దేవుడు చేసిన మనుషులు విడుదలవ్వగా...అక్టోబర్లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రిలీజ్ అవుతోంది.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2000 సంవత్సరంలో రూపొందిన 'బ్రది' చిత్రంతో కెరీర్ ప్రారంభించిన పూరి మళ్లీ పవన్ తో చేస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంతో 25 సినిమాలు పూర్తి చేసుకున్నారు. అంటే 12 ఏళ్లలో యావరేజ్‌గా 2కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్లలో ఇంత స్పీడుగా ఎవరూ సినిమాలు చేయలేదు.

    టాప్ డైరెక్టర్ రాజమౌళి తన 11 ఏళ్ల కెరీర్లో 9 సినిమాలు చేయగా...వివి వినాయక్ తన 10 ఏళ్ల కెరీర్లో 12 సినిమాలు చేసారు. శ్రీను వైట్ల తన 14 ఏళ్ల కెరీర్లో 12 సినిమాలు పూర్తి చేసాడు. ఇక త్రివిక్రమ శ్రీనివాస్ తన 10 ఏళ్ల కెరీర్లో 5 సినిమాలు మాత్రమే చేసారు. వీళ్లతో పోల్చుకుంటే పూరి స్టైల్ మహా స్పీడు. పైగా కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా అమితాబ్ తో బుడ్డా హోగా తెరా బాప్ చిత్రం రూపొందించి బాలీవుడ్లో కూడా తన ముద్ర వేసుకున్నాడు.

    English summary
    Rajamouli in his 11 years Career he delivers only 9 movies, VV Vinayak in his 10 Years Career he Did 12 Movies and Trivikram Srinivas who looks for Slow and Steady Policy On an Average he can’t deliver even a Film for Year, In his 10 Years Career he Delivered only 5 Movies. If We Compare Puri Jagan with this trend Directors he has Different Style. As he also started his Career with the above directors only How is Going to Deliver his 25th Movie Pawan Kalyan i.e.. CGTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X