'గోలీమార్'లో గోపీచంద్ కనిపించడు: పూరీ జగన్నాధ్
ముంబయి పోలీసు అధికారి దయానాయక్ స్ఫూర్తితో రూపొందిన కథ ఇది. సినిమాలో పాత్ర తప్ప హీరో కనిపించడు. గోపీచంద్ నటన అందరికీ గుర్తుండిపోతుంది. సినిమాను ఎప్పుడు ప్రారంభించామో ఎప్పుడు పూర్తయిందో అన్నట్టుంది నా ప్రతి సినిమాలో హాస్య ప్రహసనాలుంటాయి. ఈ సినిమాలో అలాంటివేవీ ఉండవు. అయితే సన్నివేశాలు వినోదాత్మకంగా సాగుతుంటాయి అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాధ్. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, ప్రియమణి కాంబినేషన్ లో రూపొందిన 'గోలీమార్' చిత్రం ఈ నెల 27న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేసారు దర్శక,నిర్మాతలు. ఇక నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...అనుకున్న సమయానికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సెన్సార్ పూర్తయింది. గోపీచంద్ నటన, పూరి దర్శకత్వ శైలి ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందన్నారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ..నటనకు అవకాశమున్న పాత్ర ఇది. నాతోపాటు సినిమాలో వున్న ప్రతి పాత్రా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. మహిళలకు కూడా నచ్చే విధంగా ఉంటుందీ చిత్రం అన్నారు. పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ మాట్లాడుతూ..సినిమాలో అన్ని పాటలనూ రాయడం మరిచిపోలేని అనుభూతి. ప్రతిసారీ నాకు మంచి పాటలు రాసే అవకాశం దక్కుతుంటుంది. ఈ సినిమాలో మగాళ్లు, పోలీసులపై పాటలు రాశాను. వాటికి చక్కటి స్పందన లభించిందని అన్నారు .


Click it and Unblock the Notifications











