చాలా థ్రిల్లింగ్‌గా ఉంది:పూరి జగన్నాధ్
పూరీ జగన్నాధ్, రవితేజ కాంబినేషన్ లో 'ఇడియట్-2"చిత్రం త్వరలో రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి వివరాలను మీడియాకు లేటెస్ట్ గా అందించారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ఇడియట్‌కి సీక్వెల్ చేస్తున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. జనవరిలో మొదలుపెట్టి వేసవికి విడుదల చేయాలనేది మా ప్రణాళిక అని చెప్పారు. ఇడియట్ తరహాలోనే ఈ సీక్వెల్ కూడా సెన్సేషన్ సృష్టిస్తుందని రవితేజ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత మాట్లాడుతూ ..సరిగ్గా 'ఇడియట్" రిలీజ్ రోజునే 'ఈ అబ్బాయి చాలా మంచోడు" మొదలుపెట్టా. రవి-పూరి కాంబినేషన్‌లో మా సంస్థలో సినిమా రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: భోగవల్లి బాపినీడు.


Click it and Unblock the Notifications











