ఫ్యాన్స్ ని ఎప్పుడూ ఎక్జయిట్ చేస్తూనే ఉండాలి....: పూరి
సాధారణంగా ఎవరైనా మంచి సినిమా తీయాలనీ, చేయాలనీ అనుకుంటారు. కానీ ఆ ఆలోచన వస్తే వాళ్ల కెరీర్ నాశనమే అని చెబుతున్నాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్. దర్శకుడు అన్నవాడు వరుసగా కమర్షియల్ సినిమాలు తీసుకుంటూ పోవాలి. ఎప్పుడైనా మంచి సినిమా తీయాలన్న ఆలోచన వస్తే అతడి నాశనం అక్కడ మొదలైనట్లే అంటున్నారు.
పదిమందికి మంచి జరిగే సినిమా అని 'నేనింతే' తీశా. ఫ్లాపయింది. నేనే కాదు, ఏ దర్శకుడైనా ఎప్పుడూ ఏదో కొత్త పాయింట్ చెప్పి ఎదుటివాళ్లని ఎక్జయిట్ చేస్తూనే ఉండాలి. లేకుంటే అక్కడ పడిపోతాం. అన్ని సందర్భాల్లోనూ అవతలివాళ్లని ఆశ్చర్యానికి గురిచేయడం కుదరదు. అప్పుడు మనల్ని పట్టించుకునేవాళ్లు ఉండరు. మన ఫోన్లను రిసీవ్ చేసుకునే వాళ్లుండరు. అందుకే వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి అని ఆయన వివరించాడు.
ప్రస్తుతం మహేష్ హీరోగా ఆయన డైరెక్ట్ చేస్తున్న 'బిజినెస్ మేన్' జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో వస్తున్న బిజినెస్ మెన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దూకుడు లో లాగే బిజినెస్ మెన్ లో కూడా పంచ్ డైలాగ్ లు ఉంటాయన్న విషయం ట్రైలర్ లో మరో సారి కనిపిస్తుంది. దూకుడు డైలాగ్ లు ఎంత ఫేమస్ అయ్యాయో తెలిసిందే. మహేష్, పూరిల పోకిరి డైలాగ్స్ రేంజ్ లోనే బిజినెస్ మెన్ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తుంది. బిజినెస్ మెన్ లో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఎక్కువ ఉండన్నున్నాయట.


Click it and Unblock the Notifications











