ప్చ్... ఎవ్వరం ఏమీ చేయలేకపోతున్నాం : పూరి జగన్నాథ్‌

By Srikanya

హైదరాబాద్ : ''ఢిల్లీలోనే కాదు, ప్రతి రోజూ ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ ఎవ్వరం ఏమీ చేయలేకపోతున్నాం. వాటికి ఈ సినిమాలో ఇచ్చిన సమాధానం నాకు నచ్చింది. ఇలాంటి సినిమాలు అందరూ చూడాలి'' అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఆర్‌.నారాయణమూర్తి దర్శకత్వం వహించిన చిత్రం 'నిర్భయభారతం'. ఈ చిత్రాన్ని సినీ ప్రముఖుల కోసం ఇటీవల హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే ..''సమాజానికి ఉపయోగపడే సినిమాలేమైనా తీస్తున్నారా? అని మమ్మల్ని చాలా మంది అడిగారు. మేం చేయలేని పని నారాయణ మూర్తి చేశారు''అని మెచ్చుకున్నారు. కీరవాణి తన స్పందన తెలియజేస్తూ ''నేరం చేసినవాడు ప్రత్యక్షంగా దొరికినప్పుడు కూడా పోలీస్‌ స్టేషన్‌లో రాచమర్యాదలు చేస్తున్నాం. అలాంటప్పుడు అందరికీ కోపం వస్తుంది. కానీ ఏం చేయలేం. అలాంటి వారికి ఆత్మసంతృప్తి ఇచ్చే చిత్రం ఇది. స్వలాభం కోసం కాకుండా సమాజం కోసం సినిమాలు తీసే నారాయణ మూర్తికి కృతజ్ఞతలు'' అన్నారు.

ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ- ''అర్థరాత్రి స్వాతంత్య్రం'నుంచి 'నిర్భయ భార తం' వరకు నిర్మాణపరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మడమతిప్పని యోధునివలె నేను ప్రారంభించిన చిత్రాన్ని పూర్తి చేయాలన్న ధృడనిశ్చయంతో నేటి వరకు సినిమాలు రూపొందించుకుంటూ వస్తున్నాను. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులెదురైనా తట్టుకుంటున్నాను. ఈ 'నిర్భయ భారతం'తో నేను ఇప్పటి వరకు 25 సినిమాలు పూర్తి చేయగలిగాను. ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అని చెప్పే చిత్రమిది. కాలేజీలో ప్యూన్‌గా పనిచేసే పేద తండ్రి తన ఇద్దరి కూతుళ్లకు జరిగిన అన్యాయానికి ఎలా కుంగిపోయాడు? తరువాత ఏ విధంగా స్పందించాడనేదే ఈ చిత్రం ప్రధాన కథగా చూపిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించి ప్రజాకవులు చక్కటి సాహిత్యాన్ని అందించారు. అన్ని హంగులు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తాను. ఈ చిత్రానికి అందరి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ- ''ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా 'నిర్భయ భారతం'. ఆర్.నారాయణమూర్తిలానే ఆయన సినిమాలు కూడా ముక్కుసూటిగా వుంటాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించి దర్శకుడిగా, నిర్మాతగా ఆయనకు మరింత మంచి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆర్.నారాయణమూర్తి చేసిన మంచి ప్రయత్నమిది''అన్నారు. ''నిర్భయ సంఘటనతో దేశం మొత్తం కదిలిపోయింది. రాజకీయ నాయకులు కన్నీరు పెట్టుకొన్నారు. కానీ వాటి వల్ల మార్పు రాదు. వ్యవస్థ మారాలి. ఈ సినిమాతో అదే చెప్పారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం ఇది''అన్నారు దర్శకురాలు బి.జయ.

జొన్నవిత్తుల మాట్లాడుతూ- ''ఈ మధ్య చాలా కథలు, సినిమాలు ఏ.సి రూముల్లో, విదేశీ సీడీల్లోంచి పుట్టుకొస్తున్నాయి. కానీ ఆర్.నారాయణమూర్తి కథలు సమస్యల్లోంచి, శ్రామికుల జీవితాల్లోంచి పుట్టుకు వస్తాయి. తన చిత్రాల ద్వారా ప్రేక్షకులు ఏదైతే సమస్యను ఏదుర్కొంటున్నారో ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించి సగటు ప్రేక్షకుడికి ఆత్మ సంతృప్తిని కలిగిస్తాయి. ఈ చిత్రంలో మంచి సందర్భంలో చక్కటి పాటలు రాసే అవకాశం లభించింది. పాటల్లాగే సినిమా కూడా అందరి అభిమానాన్ని పొందుతుందన్న నమ్మకం నాకుంది''అని వివరించారు. ఆర్.నారాయణమూర్తి, అమరేంద్ర, ఆరిఫ్, ఫారుఖ్, శ్రావణ సంధ్య, నాన్సి, స్పందన, తెలంగాణ శకుంతల, దివ్యశ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.గోపాలరావు, ఎడిటింగ్: మోహన్ రామారావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, కథ, చిత్రానువాదం, మాటలు, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X