మహేష్ బాబుతో ఛాలెంజ్ చేసాడా?
మహేష్ బాబుతో ది బిజెనెస్ మ్యాన్ చిత్రం ప్లాన్ చేస్తున్న పూరీ జగన్నాద్ రిలీజ్ విషయమై మహేష్ తో చాలెంజ్ చేసాడని వినపడుతోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్న దాని ప్రకారం ది బిజినెస్ మ్యాన్ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తానని మాట ఇచ్చి పూరీ జగన్నాద్ నిర్మాతలు అయిన ఆర్.ఆర్ మూవీ మేకర్స్ ని ఒప్పించాడు. అయితే ఎప్పుడ మొదలెట్టి, ఎప్పుడు ఫినిష్ చేస్తాడు అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. ఇదే ప్రశ్నని మహేష్ అడిగితే పూరి వెంటనే యాక్షన్ ప్లాన్ క్రింద షెడ్యూల్ మొత్తం చూపి ఈ డేట్స్ లో నువ్వు కంటిన్యూగా పనిచేస్తే సినిమా సంక్రాంతికి విడుదల చేయటం చాలా ఈజీ అని చెప్పాడు. మహేష్ అస్సలే లేట్ మాస్టర్ గా పేరు పొందిన వ్యక్తి. దాంతో అతను ఇది జరిగే పనికాదు అన్నట్లు అనటంతో కేవలం నువ్వు డేట్స్ ఎడ్జెస్ట్ చేసి నాకు కో ఆపరేట్ చేయి.. మ్యాజిక్ చేసి చూపిస్తా అని మరో సారి చెప్పాడు. అంతేగాక ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల చేస్తానని మాట ఇచ్చాడు. అయితే ఎప్పుడో మొదలెట్టిన దూకుడు చిత్రమే ఇంకా పూర్తి కాలేదు అని మహేష్ సందేహంగా చూద్దాం అని అన్నాడని చెప్తున్నారు. ఇక ది బిజెనెస్ మ్యాన్ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











