twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కో డైరక్టర్ గా పూరీ జగన్నాధ్, అసోసియేట్ డైరక్టర్ గా హరీష్ శంకర్

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ త్వరలో రూపొందించబోయే చిత్రం దొంగల ముఠాకు కేవలం ఎనిమిది మంది క్రూ మెంబర్స్ నే తీసుకుంటానన్నారు. వీరి ఎంపక జరుగుతోంది. మొదటగా ఈ చిత్రానికి కో డైరక్టర్ గా పూరీ జగన్నాధ్, అశోశియేట్ డైరక్టర్ గా మిరపకాయ డైరక్టర్ హరీష్ శంకర్ ఎంపికయ్యారు. మిగిలిన ఆరుగురు కు విపరీతమైన కాంపిటేషన్ ఉండబోతోందని తెలుస్తోంది.ఇక ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లో ఫినిష్ చేస్తానంటన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రం గురించి చెబుతూ వర్మ...కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-అప్పలరాజు సినిమా పిబ్రవరి 4న విడుదలైన వెంటనే వారం లోపల పిబ్రవరి 11న నేను రవితేజతో సినిమా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా అత్యంత ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఓ ఉత్కంఠభరితమైన ధ్రిల్లర్ అని అంటున్నారు.

    పిబ్రవరి 11కి షూటింగ్ మెదలుపెట్టి మార్చి 11కి ఈ సినిమా విడుదల చేయబోతున్నాను. అంటే ఇందులో ఛార్మి, అజయ్, సుబ్బరాజు, మంచు లక్ష్మి, బ్రహ్మాజి,బ్రహ్మానందం, అజయ్, ప్రకాష్ రాజ్, కొన్ని ముఖ్యమైన పాత్రలు ఫోషిస్తున్నారు. మిగలిన పాత్రధారుల ఎంపిక ఇంకా జరుగుతోంది.సరిగ్గా షూటింగ్ ప్రారంభించిన నెల రోజులకి. అలాగే ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన మేకింగ్ టెక్నాలిజీతో చేయటం వల్లే రెండు గంటల సినిమాని కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేసి, అంత వేగంగా రిలీజ్ చేయటం సాధ్యపడుతుంది. ఇలా ఈ టెక్నాలిజితో చేయటం వెనక నా ముఖ్య ఉద్దేశ్యం డిజిటల్ యుగంలో మనకి అందుబాటులో ఉన్న టెక్నాలిజీని సరైన పద్దతిలో ఉపయోగిస్తే ఏమేమి సాధించవచ్చో అనేది అందరికీ తెలియచేయటం అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X